ETV Bharat / entertainment

Pawan Kalyan Bro Movie : మాస్​ లుక్​లో మామా అల్లుళ్లు.. ఆ స్పెషల్​ సాంగ్​ కోసమేనా ? - పవన్ కల్యాణ్ బ్రో మూవీ లేటెస్ట్ పోస్టర్​

Bro Movie New Poster : ప‌వ‌న్​ క‌ల్యాణ్​, సాయి ధ‌ర‌మ్‌ తేజ్​ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మువీ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్​ను రిలీజ్​ చేశారు దర్శకుడు సముద్రఖని. ఇంతకీ ఆ అప్డేట్​ ఏంటంటే ?

pawan kalyan bro movie update
pawan kalyan and sai dharam tej
author img

By

Published : Jun 27, 2023, 11:51 AM IST

Pawan Kalyan Bro Movie : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్​ క‌ల్యాణ్​, మెగా సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్‌ తేజ్​ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'బ్రో' తమిళ నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. 'వినోద‌య సీతం' అనే కోలీవుడ్​ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది. మామా అల్లుళ్లు ఒకే స్క్రీన్ షేర్​ చేసుకుంటున్నందున ఈ సినిమాపై అటు మెగా ఫ్యాన్స్​తో పాటు సినీ లవర్స్​ కూడా ఆసక్తి నెలకొంది. 'గోపాల గోపాల' సినిమాలో శ్రీ కృష్ణునిగా కనిపించిన పవన్​.. ఈ సినిమాలోనూ దేవుడిగా కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్​ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్​ పనుల్లో ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సాయి ధరమ్​ లుక్​తో పాటు పవన్​ లుక్​ను రిలీజ్​ చేసిన మూవీ టీమ్​.. తాజాగా ఓ అప్డేట్​ ఇచ్చి ఫ్యాన్స్​కు ఉత్తేజం తెప్పించింది.

Bro Movie New Poster : ఈ సినిమా దర్శకుడు సముద్రఖని ట్విట్టర్​ వేదికగా ఓ అదిరిపోయే పోస్టర్​ను అప్​లోడ్​ చేశారు. అందులో పవన్​ కల్యాణ్​, సాయి ధరమ్ తేజ్ లుంగీ కట్టుకుని స్టైల్​గా నిల్చున్నారు. ఈ పోస్టర్​ చూసిన ఫ్యాన్స్ ఇక ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు. 'తమ్ముడు' సినిమాలో పవన్​ను చూసిన ఫీలింగ్​ వస్తోందని'.. నెట్టింట ఈ పోస్టర్​ను తెగ ట్రెండ్​ చేస్తున్నారు. ఇక ఈ వింటేజ్​ లుక్​లో తేజ్​ కూడా మామకు తగ్గట్టుగా సూపర్​గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ఈ లుక్ ఓ స్పెషల్​ సాంగ్ కోసమంటూ ఓ రూమర్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది.​ 'బ్రో' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేశారు. దీంతో ఇది ఆ పాట కోసమే అయ్యుండచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే బ్రో టీజర్​ను రిలీజ్​ చేస్తామని.. దీనికి సంబంధించిన అఫీషియల్​ అనౌన్స్​మెంట్ కూడా ఇస్తామంటూ మూవీ మేకర్స్​ తెలిపారు.

Bro Movie Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ రీమేక్​ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్​ను అందిస్తున్నారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్​ తేజ్​ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో.. ​ ప్రియా ప్రకాశ్​ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్​తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై వివేక్ కూచిబోట్ల, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, బ్రహ్మానందం లాంటి స్టార్స్​ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.