ETV Bharat / entertainment

Oscar 2023: ఇండియన్​ బెస్ట్ షార్ట్​ ఫిల్మ్​.. ఆ ఇద్దరు సోదరుల వల్లే.. గెలుస్తారా?

ఆస్కార్‌ నామినేషన్లు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఎవరు విజేతలుగా నిలుస్తారో అనే ఆసక్తి సినీప్రియుల్లో నెలకొంది. ఈసారి మనకు ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగాల్లో నామినేషన్లు దక్కిన సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీ విభాగంలో భారతీయ చిత్రం ఆల్‌ దట్‌ బ్రీత్‌ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీలో నామినేషన్లు అందుకున్న ఇతర చిత్రాలేంటి? ఆ వివరాలు తెలుసుకుందాం..

Oscar 2023
Oscar 2023: ఆ ఇద్దరు సోదరుల సహాయమే ఆస్కార్​కు
author img

By

Published : Feb 13, 2023, 9:04 AM IST

ఆస్కార్‌ సందడి మొదలైపోయింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ఎవరు విజేతలుగా నిలుస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఈసారి మనకు ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగాల్లో నామినేషన్లు దక్కిన సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీ విభాగంలో భారతీయ చిత్రం ఆల్‌ దట్‌ బ్రీత్‌ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీలో నామినేషన్లు అందుకున్న ఇతర చిత్రాలేంటి? వాటి విశేషాలేంటి?

మన కథకు అందలం

.

భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచింది. శౌనక్‌ సేన్‌ తెరకెక్కించిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్‌’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఈ ఏడాదికి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీని అమన్‌ మన్‌, టెడ్డీ లీఫర్‌ నిర్మించారు. పర్యావరణ కాలుష్యం, ముఖ్యంగా గాలిపటాల వల్ల కలిగే ప్రమాదాల నుంచి బ్లాక్‌ కైట్స్‌ అని పిలిచే పక్షులను రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేస్తారు దిల్లీకి చెందిన సోదరులు నదీమ్‌ షెహజాద్‌, మహమ్మద్‌ సౌద్‌. గాయపడిన పక్షుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు. విషపూరితమైన పర్యావరణం, సామాజిక అశాంతి మధ్య ఆ సోదరులు జీవుల సంరక్షణలో పగలు రాత్రి గడుపుతారు. గాయపడిన పక్షులు ఆకాశంలో తిరిగి ఎగరడానికి ఆ సోదరులు చేసిన సహాయాన్ని, వారి మధ్య అనుబంధాన్ని ఇందులో చూపించారు. సన్‌డాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రాండ్‌ జ్యూరీ బహుమతిని, కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా ‘గోల్డెన్‌ ఐ’ అవార్డును ఈ డాక్యుమెంటరీ సొంతం చేసుకుంది. దీనిని జనవరి 22, 2022లో విడుదల చేశారు.

అగ్నిపర్వత ప్రేమకథ..

.

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న మరో చిత్రం ‘ఫైర్‌ ఆఫ్‌ లవ్‌’. ఈ అమెరికన్‌ డాక్యుమెంటరీని శరదోసా తెరకెక్కించారు. షేన్‌ బోరిస్‌, ఐనా ఫిచ్మాన్‌ నిర్మించారు. ఇద్దరు ఫ్రెంచ్‌ అగ్నిపర్వత శాస్త్రవేత్తలైన కాటియా, మారిస్‌ క్రాఫ్ట్‌ల జీవితాలు, వారి అసాధారణమైన ప్రేమకథ గురించి ఈ సినిమాలో చూపించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ డాక్యుమెంటరీ సన్‌డాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘జోనాథాన్‌ ఓపెన్‌హీమ్‌ ఎడిటింగ్‌’ అవార్డును అందుకుంది. జూలై 6, 2022లో ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు.

నవల్నీ విషప్రయోగం చుట్టూ

.

డేనియల్‌ రోహర్‌ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘నవల్నీ’ 2023 ఆస్కార్‌ అవార్డు నామినేషన్‌కి ఎంపికయ్యింది. ఒడెస్సా రే, డయాన్‌ బెకర్స్‌, షేన్‌ బోరిస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ డాక్యుమెంటరీ రష్యా ప్రతిపక్ష నాయకుడైన అలెక్సీ నవల్నీ, అతని విషప్రయోగానికి సంబంధించిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ డాక్యుమెంటరీ జనవరి 25, 2022న సన్‌డాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫెస్టివల్‌ ఫేవరెట్‌ అవార్డు అందుకుంది.

రష్యాతో యుద్ధంలో ఉన్నప్పుడు

.

సైమన్‌ లెరెంగ్‌ విల్మోంట్‌ తెరకెక్కించిన డాక్యుమెంటరీ చిత్రం ‘ఎ హౌస్‌ మేడ్‌ ఆఫ్‌ స్పింట్లర్స్‌’ ఆస్కార్‌ అవార్డులో నామినేట్‌ అయ్యింది. ఉక్రెయిన్‌లోని ప్రత్యేకంగా ఆనాథశ్రమంలోని పిల్లల సంరక్షణ గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. రష్యాతో యుద్ధం పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్న పిల్లలకు సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. సన్‌డాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వరల్డ్‌ సినిమా డాక్యుమెంటరీ విభాగంలో ‘ఉత్తమ దర్శకుడి’ అవార్డును ఈ డాక్యుమెంటరీ దక్కించుకుంది. జనవరి 26, 2022లో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాన్‌ గోల్డిన్‌ జీవిత విషయాలు

.

‘ఆల్‌ ది బ్యూటీ అండ్‌ ది బ్లడ్‌షెడ్‌’ డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఈ ఏడాదికి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీ ఒక ఫోటోగ్రాఫర్‌ నాన్‌ గోల్డిన్‌ జీవితం, వృత్తికి సంబంధించిన విషయాలను ఇందులో చూపించారు. లారా పోయిట్రాస్‌ తెరకెక్కించారు. జాన్‌ లియోన్స్‌, యోని గోలిజోవ్‌, నాన్‌ గోల్డిన్‌ తదితరులు నిర్మించారు. 79వ వెనిస్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘గోల్డెన్‌ లయన్‌’ అవార్డును సొంతం చేసుకొని వెనిస్‌లో ప్రథమ బహుమతిని గెలుచుకున్న రెండవ డాక్యుమెంటరీగా నిలిచింది. సెప్టెంబరు 3, 2022న దీనిని విడుదల చేశారు.

ఇదీ చూడండి: సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే ట్రెండ్​.. కథలన్నీ మొదటికొస్తున్నాయిగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.