ETV Bharat / entertainment

జపనీస్‌లో మాట్లాడిన ఎన్టీఆర్‌.. ఫ్యాన్స్​ సర్​ప్రైజ్​ - Japan RRR release

ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో భాగంగా జపాన్​లో పర్యటిస్తున్న జూనియర్​ ఎన్టీఆర్​ జపనీస్​ భాషలో మాట్లాడి అభిమానులను ఆశ్చర్యపరిచారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి..

NTR talk in Japanese language
జపనీస్‌లో మాట్లాడిన ఎన్టీఆర్‌
author img

By

Published : Oct 21, 2022, 9:51 PM IST

Updated : Oct 21, 2022, 9:59 PM IST

యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌.. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఒకరు. అందుకే 'నటనలో నీ తర్వాతే ఎవరైనా' అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ. సింగిల్‌ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడాయన. గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్​కు సరిసాటి ఎవరూ రాలేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్​లో జోష్, ఫైట్స్​లో ఎన్టీఆర్ స్పీడ్​కు సిల్వర్​స్క్రీన్​ సైతం ఊగిపోవాల్సిందే. ఇటీవల విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ఆయన క్రేజ్​ అంతర్జాతీయ స్థాయిలో తారస్థాయికి చేరింది.

తాజాగా రామ్​చరణ్​తో కలిసి ఎన్టీఆర్​ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం జపాన్‌లో విడుదలైంది. ఈ సినిమా ప్రచారం కోసం జపాన్ వెళ్లిన హీరోలు ఇద్దరు.. అక్కడి అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా జపాన్‌లో ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి అందరూ నివ్వెరపోతున్నారు. అయితే ఎన్టీఆర్​లో నటన మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి అనేక భాషల‌ు మాట్లాడడం. సాధారణంగా హీరోలు తమ ప్రాంతీయ భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకొంతమంది సౌత్​ హీరోలైతే ప్రాంతీయ భాషతో పాటు మరో రెండు దక్షిణాది భాషలను మాట్లాడగలతారు. కానీ ఎన్టీఆర్​ మాత్రం అనర్గంలా దాదాపు తొమ్మిది భాషలు మాట్లాడతారు. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్​, స్పాన్​ ఉన్నాయి. అయితే ఇప్పుడు జపాన్​లో​ ఉన్న ఆయన.. స్టేజ్​పై జపనీస్​ భాషలోనూ మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

కాగా, నందమూరి నట వారసుడిగా 'నిన్ను చూడాలని' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్​. పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)తో బాల నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే తాతను పోలిన రూపంలో కనిపించడంతో అంతా జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పిలిచేవారు. అదే ఆయన స్క్రీన్‌ నేమ్‌గా స్థిరపడింది. కెరీర్​ల ఆరంభంలోనే ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్​తో ఎన్నో అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్​గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇదీ చూడండి: సంక్రాంతి బరిలో బాలయ్య.. 'ఎన్​బీకే 107'కు పవర్​ఫుల్​ టైటిల్​ ఫిక్స్​

Last Updated : Oct 21, 2022, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.