ETV Bharat / entertainment

వరల్డ్​ లార్జెస్ట్​ స్క్రీన్​లో తారక్ సినిమా రీరిలీజ్​.. నిమిషాల వ్యవధిలో బుకింగ్స్​ ​ఓవర్.. - ఎన్టీఆర్​ పుట్టినరోజు సింహాద్రి

తెలుగు ఇండస్ట్రీ హిట్​​ 'సింహాద్రి' సినిమాను జూ.ఎన్టీఆర్​ బర్త్​డే సందర్భంగా రీరిలీజ్​ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలోని వరల్డ్​ లార్జెస్ట్​ స్క్రీన్​లోనూ రీరిలీజ్ కానుందట. ఇప్పటికే అక్కడ బుకింగ్స్ ఓపెన్​ కాగా.. టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోయాయని తెలిసింది.

ntr simhadri re release
ntr simhadri re release
author img

By

Published : Apr 24, 2023, 4:12 PM IST

Updated : Apr 24, 2023, 4:52 PM IST

టాలీవుడ్​లో ప్రస్తుతం సినిమా రీ రిలీజ్​ ట్రెండ్​ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్​స్టార్​ మహేశ్​ బాబు 'పోకిరి'.. పవన్ కల్యాణ్​ 'జల్సా', 'తమ్ముడు', 'ఖుషీ'.. ప్రభాస్​ 'బిల్లా', 'రెబల్'​ చిత్రాలు రీరిలీజ్​ అయి మంచి కలెక్షన్స్​ను అందుకున్నాయి. ఇప్పుడు జూ.ఎన్టీఆర్​ నటించిన బ్లాక్​బస్టర్​ 'సింహాద్రి' సినిమా కూడా మే 20న రీరిలీజ్​ అయ్యేందుకు సిద్ధమైంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్​కు విదేశాల్లోనూ మంచి క్రేజ్​ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సింహాద్రి సినిమాను ఆస్ట్రేలియాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ మెల్​బోర్న్​ సిటీలోని ఐమాక్స్​ థియేటర్​లో రీరిలీజ్​ చేస్తున్నారు. ఈ ఐమాక్స్ ​ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్​ ఉన్న థియేటర్​గా ప్రత్యేక గుర్తింపు కూడా పొందింది. తాజాగా సోమవారం ఈ థియేటర్​లో 'సింహాద్రి'​ బుకింగ్స్​ను ఓపెన్​ చేశారు. బుకింగ్స్​ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ హాట్​ కేకుల్లా అమ్ముడుపోయాయని తెలిసింది. ఆస్ట్రేలియాలో సైతం ఈ విధమైన రెస్పాన్స్​ రావడం.. ఎన్టీఆర్​కు విదేశాల్లో క్రేజ్​ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

4k డాల్బీ అట్మాస్​ టెక్నాలజీలో ఆడియెన్స్​ను అలరించనుంది సింహాద్రి. ఈ సినిమాకు రీరిలీజ్​లోనూ బీభత్సమైన హైప్​ లభిస్తోంది. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి బుకింగ్స్​ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా అప్పట్లోనే పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా 2003లో విడుదలైన సింహాద్రి.. బాక్సాఫీస్​ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసింది. సింగ‌మ‌లై, సింహాద్రి పాత్రల్లో ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ యాక్టింగ్ అభిమానుల‌ను మెప్పించింది.ఈ సినిమాలో భూమికా చావ్లా, అంకిత హీరోయిన్లుగా, నాజర్​ కీలక పాత్రలో నటించారు. ఎస్​.ఎస్​ రాజమౌళి ఆ సినిమాకు దర్శకత్వం వహించారు.

అదే బాటలో 'ఆది' రానుందా...? వి.వి వినాయక్​ డైరెక్షన్​లో ఫ్యాక్షన్ జోనర్​లో తెరకెక్కిన 'ఆది' సినిమాను కూడా వచ్చే నెలలోనే రీరిలీజ్​ చేయాలని సినిమా బృందం ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిచారు. ఆది సినిమాతో దర్శకుడు వీ.వీ వినాయక్​ ఎన్టీఆర్​లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పట్లో ఈ సినిమా కూడా సూపర్​ హిట్​గా నిలిచింది.

ఇకపోతే ప్రస్తుతం తారక్.. ​ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల తార దివంగత నటి శ్రీ దేవి కుమార్తె.. జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్​లోకి అడుగుపెట్టనున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సైఫ్​ అలీఖాన్​ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

Last Updated : Apr 24, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.