ETV Bharat / entertainment

'గుంటూరు కారం'-'హరిహర వీరమల్లు' అప్డేట్​ లీక్.. నిధి అగర్వాల్​, మీనాక్షి చెప్పేశారుగా! - ఉస్తాద్ భగత్ సింగ్ కథ

గుంటూరు కారం, హరిహర వీరమల్లు సినిమాల అప్డేట్స్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ సర్​ప్రైజ్​ అందింది. హీరోయిన్స్​ నిధి అగర్వాల్​, మీనాక్షి చౌదరి.. ఈ సినిమాల గురించి కీలకమైన అప్డేట్లను లీక్​ చేశారు.

Nidhi Agarwal Meenakshi Chowdary
గుంటూరు కారం, హరిహర వీరమల్లు.. నిధి, మీనాక్షి అప్డేట్స్ లీక్​ చేసేశారుగా!
author img

By

Published : Jul 17, 2023, 2:30 PM IST

Updated : Jul 17, 2023, 2:37 PM IST

Harihara veeramallu latest update: పవర్​స్టార్​ పవన్ కల్యాణ్‌-క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమా అప్డేట్స్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర హీరోయిన్​ నిధి అగర్వాల్ సినిమా గురించి ఓ అప్డేట్​ ఇస్తూ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం అది సోషల్​మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు, నెటిజన్లు.. థ్యాంక్స్‌ నిధి అని చెబుతూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఆమె పెట్టిన పోస్ట్​ను ట్రెండింగ్ చేస్తున్నారు.

రీసెంట్​గా పవన్‌ కల్యాణ్‌.. తన ఇన్‌స్టాలో ఫస్ట్​ పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఓ స్పెషల్​ వీడియోను క్రియేట్ చేసి పెట్టారు. చిత్రసీమతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ అది పెట్టారు. చిత్రసీమకు చెందిన వారితో ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫొటోలను అన్నింటినీ జోడిస్తూ ఈ వీడియోను షేర్‌ చేశారు. అందులో 'హరి హర వీరమల్లు'లో నిధి అగర్వాల్‌తో దిగిన ఫొటో కూడా ఉండటం విశేషం. ఈ ఫొటో స్క్రీన్‌ షాట్‌ను నిధి అగర్వాల్​ పోస్ట్ చేసింది. అది ఈ చిత్రంలోని ఫస్ట్ సీన్ అని చెప్పింది. అలానే పవన్‌తో కలిసి నటించడంపై ఆనందం వ్యక్తం చేసింది. తన అనుభూతిని కూడా తెలిపింది. పవన్​తో కలిసి నటించడంతో తన డ్రీమ్​ నేరవేరిందని కాస్త ఎమోషనల్​ అయింది. "ఇలాంటి గొప్ప సినిమాలో నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. అద్భుతమైన మూవీటీమ్​తో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. నన్ను నమ్మండి.. మీరు త్వరలోనే థియేటర్లలో అద్భుతాన్ని చూస్తారు" అంటూ రాసుకొచ్చింది. అలాగే పవన్‌ కల్యాణ్‌కు, క్రిష్‌కు ప్రత్యక కృతజ్ఞతలు తెలిపింది.

Gunturu karam movie second heroine : సెకండ్ హీరోయిన్​గా మీనాక్షి.. 'గుంటూరు' కారం సినిమాలో పూజాహెగ్డే తప్పుకుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. శ్రీలీల మెయిన్ హీరోయిన్​గా నటిస్తోందని ప్రచారం సాగింది. దీంతో చిత్రంలో రెండో హీరోయిన్​ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా దీనిపై స్పెష్టత వచ్చేసింది. హీరోయిన్​ మీనాక్షి చౌదరి తాను గుంటూరు కారంలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా లీక్ చేసింది. అలానే సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్​ను కూడా ఇచ్చింది. దీంతో మహేశ్ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి మాట్లాడుతూ.. "ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తైంది. మహేశ్‌ అంటే నాకెంతో ఇష్టం. నేను ఆయనకు అభిమానిని. ఆయనతో నటిస్తున్న అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. షూటింగ్‌కు వెళ్లిన తొలి రోజే, ఫస్ట్ సీన్​ మహేశ్‌తో కలిసి చేశాను. ఆ రోజును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను" అని మీనాక్షి చౌదరి చెప్పింది.

Last Updated : Jul 17, 2023, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.