ETV Bharat / entertainment

NBK 108 సూపర్​ అప్డేట్​.. బాలయ్యతో చేయి కలిపిన యువ హీరోయిన్! - ఎన్​బీకే 108 సినిమా

బాలకృష్ణ తదుపరి చిత్రం NBK108 నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యువ నటి శ్రీలీల.. బాలకృష్ణతో స్క్రీన్​ షేర్​ చేసుకోనుంది. ఈ మేరకు దర్శకుడు అనిల్​ రావిపూడి సోషల్​ మీడియా వేదికగా ప్రకటించారు.

sri leela nbk108
sri leela nbk108
author img

By

Published : Mar 9, 2023, 9:23 PM IST

నందమూరి నటసింహ బాలకృష్ణతో యువ హీరోయిన్‌ శ్రీలీల సందడి చేయనుంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న #NBK108 సినిమాలో ఓ కీలక పాత్రలో శ్రీలీల నటించనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్న చిత్రీకరణలో ఆమె గురువారం పాల్గొన్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు బాలయ్యతో శ్రీలీల చేయి కలిపిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ ఫొటోలో శ్రీలీల నవ్వుతూ.. విజయ సంకేతం చూపిస్తూ కనిపించారు. బాలయ్య చేతికి ఓ తాడు, కడియం, టాటూ కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్​ అవుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీలీలతోపాటు బాలకృష్ణ చెయ్యి మాత్రమే కనిపించేలా డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌.. అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కాగా, NBK108 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాలో.. శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని దర్శకుడు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటి వరకు అనిల్​ రావిపూడి.. 'పటాస్‌', 'ఎఫ్‌ 2', 'సరిలేరు నీకెవరు', 'ఎఫ్‌ 3' తదితర హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. అయితే, గత చిత్రాలకు భిన్నంగా ఈ 'ఎన్బీకే 108'ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో శ్రీలీలను బాలకృష్ణ కూమార్తెగా చూపించనున్నారని సమాచారం. బాలయ్య సరసన ఎవరు నటిస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. కాగా, ఈ విషయంలో కాజల్‌ అగర్వాల్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. షైన్స్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 'పెళ్లి సందD'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. మొదటి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ సరసన ఆమె నటించిన 'ధమాకా' సినిమా ఆమెకు క్రేజ్‌ తీసుకొచ్చింది. దీంతో 'ఎన్బీకే 108' సహా పలువురి అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్​లో మీడియం రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ.. అందరికీ ఈ కన్నడ పిల్లనే ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. శ్రీలీలకు ఉన్నంత డిమాండ్ టాలీవుడ్​లో మరే హీరోయిన్​కు లేదంటే అతిశయోక్తి కాదు. కాగా, సితార బ్యానర్​లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈ అమ్మడి ఖాతాలోకే వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యువ సంచలనం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమాలో శ్రీలీలను హీరోయిన్​గా ఫైనల్​ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కోసం.. మేకర్స్​ ఈ బ్యూటీతో చర్చలు జరుతున్నారని సమాచారం. రాబోయే రెండేళ్ల వరకూ ఆమె డేట్స్​కు భారీ డిమాండ్ ఉంటుందనే సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.