ETV Bharat / entertainment

NBK 107 క్రేజీ అప్డేట్​.. 'అన్​స్టాపబుల్​-2'కు గెస్ట్​లుగా విశ్వక్​ సేన్​, డీజే టిల్లు - nbk 107 release date

NBK 107 Update : 'అఖండ'తో అద్భుత విజయం అందుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు బుల్లితెరపైనా సందడి చేస్తున్నారు. దీంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా బాలయ్య మరో చిత్రం 'ఎన్​బీకే 107' నుంచి అప్డేట్​ వచ్చింది. అదెేంటంటే..

balakrishna upcoming movie NBK 107 update

author img

By

Published : Oct 16, 2022, 11:29 AM IST

Updated : Oct 16, 2022, 11:58 AM IST

NBK 107 Latest Update: నటసింహం బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఊర్రూతలూగించడానికి రెడీ అయ్యారు. 'అఖండ'తో ఘన విజయం సొంతం చేసుకున్న బాలయ్య.. మరో క్రేజీ ప్రాజెక్టు 'ఎన్​బీకే 107'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. అక్టోబర్ 21న సినిమా పేరును ప్రకటిస్తామని.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ వెల్లడించింది.

'ఎన్​బీకే 107' సినిమాను 'అఖండ' విడుదలైన డిసెంబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్​. ఒకవేళ అది కాకపోతే.. సంక్రాంతి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్​ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు అందిస్తున్నారు.

అన్​స్టాపబుల్​ షోలో సిద్ధూ, విశ్వక్​ సెన్
బాలయ్య హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్​ షో-2'కు సంబంధించి సూపర్​ అప్​డేట్​ వచ్చింది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్​కు​ గెస్ట్​గా మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయడు, ఆయన కుమారుడు లోకేశ్​ వచ్చారు. గంటపాటు నవ్వుల వర్షం కురిపించారు. రెండో ఎపిసోడ్​ అదే రేంజ్​లో ఉండేందుకు.. మాస్​కా దాస్​ విశ్వక్​ సేన్​, 'డీజే టిల్లు'తో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్​ ప్రోమోను ఆహా రిలీజ్​ చేసింది. ఇందులో ఇద్దరు యువ కథానాయకులతో.. బాలయ్య అల్లరి మామూలుగా లేదు. వీళ్ల రాకతో రెండో ఎపిసోడ్​లోనూ ప్రేక్షకులకు అన్​స్టాపబుల్​ ఫన్​ అందించబోతున్నారని స్పష్టం అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: రిషబ్ శెట్టి 'కాంతార-2' సీక్వెల్​ రానుందా?.. ఇదిగో క్లారిటీ!

పోలీస్‌ కథలు.. యాక్షన్‌ మొదలు.. సత్తా చాటేందుకు స్టార్​ హీరోలు రెడీ!

Last Updated : Oct 16, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.