ETV Bharat / entertainment

మరో హారర్​ సినిమాలో నయన్​.. ఆ స్టార్​ హీరో సినిమాలో ఛాన్స్​!

author img

By

Published : Dec 28, 2022, 10:50 PM IST

ఖైదీ, విక్ర‌మ్​ లాంటి హిట్​ సినిమాలను అందించిన టాప్ డైరెక్ట‌ర్​ లోకేశ్​ క‌న‌గరాజ్‌ సినిమాలో నయన్​ ఓ సినిమా సైన్​ చేసిందట. ఆ మూవీలో మరో యాక్టర్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఎవరంటే..

Nayanthara Lokesh Kanagaraj Movie
nayanthara

కోలివుడ్​ ఇండస్ట్రీకి ఖైదీ, విక్ర‌మ్​ లాంటి హిట్​ సినిమాలను అందించి టాప్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిన దర్శకుడు లోకేశ్​ క‌న‌గరాజ్‌. ఈయనతో సినిమాలు చేసేందుకు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్​లోని టాప్ స్టార్స్​ అందరూ ఆస‌క్తి కనబరుస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో హిట్లను ఆస్వాదిస్తున్న లోకేశ్​ దళపతి విజ‌య్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నట్లు సమాచారం.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ సినిమాతో లోకేశ్​ నిర్మాత‌గా మార‌నున్నారట. క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్స్‌తో లొకేశ్​ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ హార‌ర్ థీమ్​ మూవీ గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్​ వెలుగులోకి వచ్చింది. ఓ వైపు దర్శకుడు మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న లోకేశ్​ ఈ సినిమాకు కథను సైతం రాశారట.

దళపతి విజయ్​కు జోడీగా లేడీ సూపర్​ స్టార్​ నయన్​ ఈ సినిమాలో సండది చేయన్నున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాఘవ లారెన్స్​ సైతం ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్లు టాక్​. ర‌త్న‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్​ను త్వ‌ర‌లోనే రిలీజ్​ చేయనున్నట్లు సమాచారం. అయితే న‌య‌న్​ లారెన్స్ క‌లిసి నటించడం ఇదే తొలిసారి. ప్ర‌స్తుతం లారెన్స్ చంద్ర‌ముఖి -2 సినిమా షూటింగ్​లో బీజీగా ఉన్నాడు. మ‌రోవైపు న‌య‌న‌తార జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.