ETV Bharat / entertainment

బాక్సాఫీస్​ వద్ద 'దసరా' కాసుల వర్షం.. రెండు రోజుల్లో రూ.50 కోట్లు! - నాని దసరా మూవీ సీడెడ్​ కలెక్షన్స్

నాని 'దసరా' మూవీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. రెండో రోజు కలెక్షన్స్​ ఎలా ఉన్నాయంటే?

nani dasara box office collections
nani dasara day 2 box office collections
author img

By

Published : Apr 1, 2023, 2:27 PM IST

నేచుర‌ల్ స్టార్ నాని లేటెస్ట్​ పాన్ ఇండియా మూవీ 'ద‌స‌రా' బాక్సాఫీస్​ వద్ద రెండో రోజూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ రెండు రోజుల్లో హిట్​ టాక్‌తో పాటు క‌లెక్ష‌న్ల ప‌రంగా సంచలనాలను సృష్టిస్తోంది. తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేసిన ఈ మూవీ.. రెండో రోజు దాదాపు రూ.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల్లో మొత్తం రూ.53 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ సినిమా రెండో రోజు కలెక్ష‌న్లను ఓ సారి చూస్తే..

  • నైజాం - రూ.10.26 కోట్లు
  • సీడెడ్ - రూ. 3.02 కోట్లు
  • ఉత్త‌రాంధ్ర - రూ. 2.06 కోట్లు
  • తూర్పు గోదావరి - రూ. 1.18 కోట్లు
  • పశ్చిమ గోదావరి - రూ. 71 ల‌క్ష‌లు
  • కృష్ణా - రూ. 92 ల‌క్ష‌లు
  • గుంటూరు - రూ. 1.46 కోట్లు
  • నెల్లూరు - రూ. 47 ల‌క్ష‌లు

రెండు​ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.20.08 కోట్లను కలెక్ట్​ చేసింది. గ్రాస్​గా సుమారు రూ.34.45 కోట్లకు మేర సంపాదించిందని ట్రేడ్​ వర్గాల టాక్​. ఓవ‌ర్‌సీస్‌లో ఈ మూవీ రూ.5.60 కోట్లు షేర్ క‌లెక్ష‌న్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.29.08 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. గ్రాస్ ప్ర‌కారం చూస్తే రూ.52.40 కోట్లు వసూలైందని సమాచారం.

ప్రీ రిలీజ్​ బిజినెస్​లోనూ అదుర్స్​..
దసరా సినిమా రిలీజ్​కు ముందే రూ.48 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ట్రేడ్​ వర్గాల ప్రకారం ఈ సినిమాకు మ‌రో 20 కోట్లు రావాల్సి ఉంది. వీకెండ్​లో రూ.20 కోట్లు సాధించడం పక్కా అని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 2700 స్క్రీన్స్​లో రిలీజైంది.

సినిమా విషయానికి వస్తే.. తెలంగాణలోని వీరపల్లి అనే గ్రామంలోని బొగ్గు కార్మికులు నేపథ్యంలో తెరకెక్కింది దసరా మూవీ. ఈ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల.. తొలి సినిమాతోనే హిట్​ కొట్టేశారు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేశ్​ నటించగా.. దీక్షిత్​ శెట్టి, టామ్​ చాకో, సాయికుమార్​, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. నాని న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా నాని కెరీర్​లో ఓ బెస్ట్​ మైల్​ స్టోన్​గా నిలిచింది. ముఖ్యంగా నాని యాక్టింగ్​కు ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. కీర్తి సురేశ్​ కూడా తనదైన శైలిలో నటించి మెప్పించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.