ETV Bharat / entertainment

అప్పుడు వాళ్లు నన్ను చాలా భయపెట్టారు: నాని - హిట్​ 2 మూవీ కలెక్షన్స్​

'హిట్​ 2'తో నిర్మాతగా మరో విజయాన్ని అందుకున్న హీరో నాని.. కొంతమంది కలిసి ఆ విషయంలో తననెంతో భయపెట్టారని గుర్తుచేసుకున్నారు. ఆ వివరాలు..

nani fears about production house
అప్పుడు వాళ్లు నన్ను చాలా భయపెట్టారు: నాని
author img

By

Published : Dec 5, 2022, 11:57 AM IST

నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన సమయంలో తనను ఎంతోమంది భయపెట్టారని అన్నారు నేచురల్ స్టార్ నాని. 'హిట్‌-2'తో నిర్మాతగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన తాజాగా తాజాగా ఆ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

''నటుడిగా నేను వేరే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వాల్‌ పోస్టర్‌ సినిమా టీమ్‌ కష్టపడి పనిచేయడం వల్లే ఈ సినిమా సాఫీగా పూర్తైంది. 'హిట్‌-2' కోసం పనిచేసిన నటీనటులు, ఇతర టెక్నికల్‌ బృందానికి ధన్యవాదాలు. శేష్‌.. కష్టపడి పనిచేసే వ్యక్తి. అతను నటించిన సినిమాలన్నీ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ కావడానికి కారణమదే. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలి, విభిన్న చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ మొదలు పెట్టినప్పుడు.. ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు?, ఇలాంటివి చేస్తే వర్కౌట్‌ అవుతుందా? అని ఎంతోమంది నన్ను భయపెట్టారు. డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయట్లేదు.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే గట్టి నమ్మకంతోనే చేస్తున్నా. అది మరోసారి నిరూపితమైంది'' అని నాని అన్నారు.

దాదాపు ఏడు విభిన్నమైన కథలతో హిట్‌ వర్స్‌ను రూపొందిస్తున్నారు దర్శకుడు శైలేశ్‌ కొలను. మొదటి కథకు విశ్వక్‌సేన్‌ను హీరోగా ఎంచుకున్న ఆయన ఇప్పుడు 'హిట్‌-2'లో అడివి శేష్‌ను పోలీస్‌ అధికారిగా ప్రధాన పాత్రలో చూపించారు. విశాఖపట్నంలో జరిగిన యువతుల హత్య కేసు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నాని దీన్ని నిర్మించారు. 'హిట్‌-3'లో నాని కథానాయకుడిగా కనిపించనున్నారు.

ఇదీ చూడండి: హీరోయిన్ హన్సిక మ్యారేజ్​ ఫోటోస్ సూపర్ మీరు చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.