ETV Bharat / entertainment

'దసరా'పై ట్రోల్స్​.. అందుకే RRR​, KGFలతో పోల్చాను: నాని - దసరా మూవీపై ట్రోల్స్​

దసరా మూవీ విషయంలో ట్రోల్స్​ రావడంపై స్పందించారు హీరో నాని. ఈ చిత్రాన్ని తాను ఎందుకు ఆర్​ఆర్​ఆర్​, కేజీయఫ్​లతో ఎందుకు పోల్చారు వివరించారు.

Nani reacted on Dasara trolss
దసరాపై ట్రోల్స్​ నాని
author img

By

Published : Feb 14, 2023, 9:55 AM IST

Updated : Feb 14, 2023, 11:42 AM IST

నేచురల్ స్టార్​ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం దసరా. కీర్తి సురేశ్‌ కథానాయిక. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్​ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ చిత్రం పుష్ప కాపీ అంటూ కూడా ట్రోల్స్​ వచ్చాయి. ఇకపోతే ఇటీవలే నాని ఈ చిత్రాన్ని కేజీయఫ్, ఆర్​ఆర్ఆర్​తో పోలుస్తూ కామెంట్స్​ చేయడం వైరల్​గా మారింది. అయితే వీటిపై నాని స్పందించారు. తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్​మీట్​లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఈ సినిమాలో మీ లుక్ చూసి పుష్పలో అల్లు అర్జున్​తో పోల్చుతున్నారు. ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?.. అని అడగగా... "ఈ పదేళ్లలో ఓ ఐదు వందల సినిమాలు వచ్చాయి అనుకోండి. అందులో 495 సినిమాలలో హీరోలంతా ప్యాంటు, షర్ట్​లోనే కనిపిస్తారు. అలాగని వాళ్ళనెప్పుడు సేమ్ లుక్ అని అనలేం. లుంగీ, బనియన్​తో ​రూరల్ సినిమాలు చాలా రేర్​గా చేస్తుంటాం. చివరి సారిగా బన్నీతో సుకుమార్ పుష్ప తీశారు. ఇక్కడ అలాంటి గెటప్ కలిసేసరికి సేమ్ అనేస్తున్నాం. ఎందుకంటే.. ఇలాంటివి ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చి ఉంటే.. ఈ కంపారిజన్స్, రిఫరెన్స్​లు ఉండేవి కాదు. పక్కా ఈ సినిమా డిఫరెంట్​గా ఉంటుంది" అని చెప్పారు.

దసరాను ఆర్ఆర్ఆర్, కేజీయఫ్​ రేంజ్ సినిమాలతో పోల్చారు? ఎందుకలా.. "ఈ ప్రశ్నపై నేను అందరికి క్లారిటీ ఇవ్వాలి. మేం ఏం చెప్తామో దాన్ని కొన్ని సార్లు మరో రకంగా తీసుకుంటారు. నేను ఏం చెప్పానంటే.. ఆర్ఆర్ఆర్, కేజీయఫ్​​ లాగా అంటే 500 కోట్లు, 1000 కోట్లు వస్తాయి అని కాదు.. అవి ఆయా ఇండస్ట్రీలు గర్వించదగ్గ సినిమాలు. ప్రతి ఏడాది ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో ఆణిముత్యం వస్తుంది. ఇది మా ఇండస్ట్రీ మూవీ, దీన్ని మేము చేశాం అని చెప్పుకునే సినిమాలు ఉంటాయి. అలా గతేడాది ఆర్ఆర్ఆర్, కేజీయఫ్​లు వచ్చాయి. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుంచి రాబోతున్న అలాంటి ఆణిముత్యం సినిమా దసరా అని అప్పుడు అన్నాను" అంటూ నాని వివరించారు.

ఈ చిత్రానికి ఏదైనా అవార్డు ఆశిస్తున్నారా అని అడగగా.. "వద్దండీ.. ఇప్పటికే చాలా ఉన్నాయి ఇంట్లో. నేను మీ ప్రేమనే కోరుకుంటున్నా. అదే చిరస్థాయిగా ఉంటుంది. ఎవరైనా అవార్డు ఇస్తే మాత్రం వద్దనకుండా తీసుకుంటా. ఇక కీర్తి సురేశ్‌తో మరోసారి కలిసి నటించడం మంచి అనుభవం. మేం గతంలో నేను లోకల్‌ సినిమాలో కలిసి నటించాం. అందులోని పాత్రలను గుర్తుచేస్తూ మమ్మల్ని పొట్టి, బాబు అని ఇప్పటికీ పిలుస్తున్నారు. మార్చి 30 నుంచి ఆ పేర్లు వినిపించవు. ధరణి, వెన్నెల పేర్లే వినిపిస్తాయి. ఇకపై దీన్ని బ్రేక్‌ చేయాలంటే చాలా కష్టం." అని అన్నారు.

ఇదీ చూడండి: Samyuktha Menon: ఆ స్టార్ హీరోతో కలిసి అలా చేశా.. ఎప్పటికీ మర్చిపోలేను..

Last Updated : Feb 14, 2023, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.