ETV Bharat / entertainment

Nani Mrunal Liplock : మృణాల్​ ఠాకూర్​తో​ లిప్ ​లాక్​.. హీరో నాని ఇంట్లో గొడవలు! - హాయ్ నాన్న టీజర్

Nani Mrunal Liplock : మృణాల్​ ఠాకూర్​తో లివ్​లాక్ కిస్​ చేయడంపై హీరో నాని స్పందించారు. తన ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పారు. ఆ సంగతులు..

Nani Mrunal Liplock : మృణాల్​ ఠాకూర్​ లిప్​లాక్​.. హీరో నాని ఇంట్లో గొడవలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 5:58 PM IST

Nani Mrunal Liplock : నేచురల్ స్టార్ నాని - మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫీల్​ గుడ్​ ఎమోషనల్​ లవ్ స్టోరీ 'హాయ్​ నాన్న'. తండ్రీ- కుమార్తెల సెంటిమెంట్​తో.. వైరా ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్​ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్​ను విడుదల చేశారు మేకర్స్​. అయితే ఈ ప్రచార చిత్రంలో తండ్రి - కూతుర మధ్య ఉన్న బంధాన్ని చూపించడంతో పాటు నాని - మృణాల మధ్య ఉండే లవ్​ స్టోరీని కూడా చూపించారు. ఇంకా ప్రచార చిత్రంలో నాని, మృణాల్​ మధ్య చూపించిన లిప్​ లాక్ సీన్స్ బాగా డ్రెండ్ అయ్యాయి.

అయితే టీజర్ లాంఛ్ ఈవెంట్​లో నానికి కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఎదురైయ్యాయి. మీరు నటించిన ప్రతి సినిమాలో లిప్​ లాక్ సీన్స్ ఉంటున్నాయి. ఎందుకు అలా.. ఇంట్లో చూస్తే గొడవలు తప్పవా అని ఓ విలేకరి అడగగా.. నాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

"ఇప్పుడే కాదా టీజర్​ను విడుదల చేసింది. ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలి. నేను చేసిన ప్రతి సినిమాలోను లిప్​లాక్​ సన్నివేశాలు లేవు. 'దసరా','అంటే సుందరానికీ' ఈ సినిమాల్లో అలాంటి ముద్దు సీన్స్ లేవు. అలాంటి సీన్స్​లో నటించినప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటాయి(నవ్వుతూ). సీన్​కు అవసరం అనుకుంటే.. దర్శకుడు తప్పకుండా ఆ సీన్​ కావాలని చేబితే చేస్తాను."

మీరు 'జెర్సీ', 'శ్యామ్ సింగరాయ్' వంచి మంచి సినిమాలు చేసినప్పటికీ.. నిర్మాతలకు అనుకున్నంత డబ్బులు రాలేదని టాక్ అన్న ప్రశ్నకు.. "ఈ మాట ఏ నిర్మాతలు చెప్పారో చెప్పండి. వాళ్ల ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఆ రెండు సినిమాలు మంచిగానే వసూళ్లు అందుకున్నాయి. 'జెర్సీ'ని ఉదాహరణగా చూపించటం కరెక్టు కాదు. కావలంటే 'అంటే సుందరానికీ'ని ఉదాహరణగా చెప్పొచ్చు. తెలసీ తెలియని వాళ్లు సోషల్ మీడియాలో ఇలాంటివి అంటే వాటిని పట్టించుకోవద్దని, అలానే నిజనిజాలు తెలుసుకొని మాట్లాడాలని" అని నాని కాస్త అసహనంగా సమాధానం ఇచ్చారు.

ఇకపోతే జెర్సీ నిర్మాత నాగవంశీ కూడా 'ఎక్స్' వేదికగా స్పందించారు. సితార ఎంటర్​టైన్ మెంట్స్ బ్యానర్​లో నిర్మించిన లాభదాయకమైన చిత్రాల్లో 'జెర్సీ' ఒకటిని అన్నారు. "ఆ సినిమా మాకు జాతీయ స్థాయిలో గుర్తింపు, ఎనలేని గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టిందని" నాగవంశీ పేర్కొన్నారు. ఒక నిర్మాతగా నేను ఈ సినిమా విషయంలో ఆనందంగా ఉన్నా అని నాగవంశీ చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.