ETV Bharat / entertainment

నాని 'దసరా'కు అగ్ని పరీక్ష.. నేచురల్​ స్టార్​కు అసలు ఆట ఇప్పుడే! - దసరా మూవీ వరల్డ్​వైడ్ కలెక్షన్స్

విడుదలై నాలుగు రోజులే అవుతున్నా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్​ల సునామీ సృష్టిస్తోంది నాని 'దసరా'. ఇప్పటి వరకు రూ.87 కోట్ల గ్రాస్​ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్​కు అతి సమీపంలో ఉంది. కానీ, ఈ మార్క్​ను చేరుకోవడానికి నాని సినిమాకి కొన్ని అడ్డంకులు తప్పేలా లేవు. అవేంటంటే?

Hero Nani Dasara Movie Collections
న్యాచురల్​ స్టార్​ నాని దసరా మూవీ కలెక్షన్స్
author img

By

Published : Apr 3, 2023, 2:55 PM IST

Updated : Apr 3, 2023, 3:28 PM IST

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30న విడుదలైన 'దసరా' బాక్సాఫీస్​ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.87 కోట్ల గ్రాస్​వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్​కు అతి చేరువలో ఉంది. కానీ, ఈ మార్క్​ను నాని సినిమా అందుకుంటుందా లేదా అన్నది అసలు విషయం. ఎందుకంటే ఈ సినిమాకు ప్రస్తుతం కొన్ని అడ్డంకులు వచ్చి పడ్డాయి!

ట్రేడ్​ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటివరకు వరల్డ్ ​వైడ్​గా రూ.47 కోట్ల షేర్​ను సాధించింది దసరా మూవీ. కలెక్షన్ల రూపంలో సుమారు రూ.87 కోట్ల మార్క్​ను ఈ సినిమా ఇప్పటికే చేరుకుంది. వినోద రంగంపై ఆధారపడే కొన్ని రంగాలు ముఖ్యంగా సినిమా థియేటర్లు.. ఇవి విక్రయించే టికెట్ల అమ్మకాలు సాధారణంగా వీక్​ డేస్​లలో తగ్గుతాయి. పైగా ఈరోజు సోమవారమే కావడం వల్ల టికెట్​ బుకింగ్స్​లో పెద్దగా డ్రాప్​ కనిపించకపోయినా.. రానున్న రోజుల్లో ఈ సినిమా ప్రీ-బుకింగ్స్​పై ప్రభావం పడుతుంది. దీంతో ఈ సినిమాకు అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలుకానుంది.

ఇప్పటికే దసరా అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త నెమ్మదించినట్లు థియేటర్ల ఓనర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కేవలం రూ.13 కోట్ల తేడాతో వంద కోట్ల టార్గెట్​ను చేరుకోవడానికి నేచురల్​ స్టార్​ నానికి ఈ రెండు వారాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే లక్ష్యానికి అతి దగ్గర్లో ఉన్నందున కలెక్షన్ల విషయంలో పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదని సినిమా డిస్ట్రీబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు.

సినిమా వసూళ్లపై ప్రభావం​ చూపే అంశాల్లో అధిక టికెట్ల ధర ఒకటి. ముఖ్యంగా హైదరాబాద్​లో సినిమా టికెట్ల పెంపు అనేది తెలుగు సినిమా కలెక్షన్​లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బడా సినిమా హాల్స్​లో టికెట్​ ధరలను పెంచడం వల్ల భారీ సినిమా కలెక్షన్స్​కు కాస్త సహాయపడినా.. వీటిని మళ్లీ తగ్గించేందుకు థియేటర్ల యజమానులు సిద్ధంగా లేరు. దీంతో ఎక్కువ మొత్తంలో టికెట్​లకు చెల్లించి మరీ పనిదినాల్లో సినిమాను చూడాలంటే ఆడియన్స్​ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.

దసరా అడ్వాన్స్​ బుకింగ్​లు తగ్గడానికి మరో ప్రధాన కారణం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లలు లేకుండా ఏ కుటుంబం కూడా పెద్దగా సినిమా హాల్స్​కు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి చూపదు. పరోక్షంగా దీని ఎఫెక్ట్​ కూడా దసరా సినిమా కలెక్షన్స్​పై పడనుంది! ఇదిలా ఉంటే ఏప్రిల్​ 7న రవితేజ రావణాసురతో పాటు కిరణ్​ అబ్బవరం మీటర్​ సినిమాలు థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రిలీజ్​ తర్వాత రావణాసుర, మీటర్ ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల టాక్​ను బట్టి 'దసరా' సినిమా వసూళ్లు రూ.100 కోట్లకు చేరుతుందా లేదా అన్నది తెలుస్తుంది. ఇకపోతే కేవలం రూ.13 కోట్ల దూరంలోనే ఉన్నందున నాని కచ్చితంగా వంద కోట్ల గ్రాస్​ను కొల్లగొడతాని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే నాని సినిమా కెరీర్​లోనే ఈ సినిమా కలెక్షన్స్​ పరంగా అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది.

కాగా, మొదటి మూడు రోజుల్లోనే దసరా రూ.71 కోట్ల వసూళ్లను రాబట్టింది. కేవలం ఇండియాలోనే నాలుగో రోజు రూ.14 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా.. వరల్డ్​వైడ్​గా కలుపుకుని ఇప్పటివరకు రూ.87 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరో నాని పక్కా మాస్​లుక్​లో కనిపించారు. నటి కీర్తి సురేశ్​​ మహానటి తర్వాత మరోసారి తనదైన యాక్టింగ్​తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. దీక్షిత్​ శెట్టి, సముద్రఖని, షైన్​ టామ్​ చాకో, సాయికుమార్​, జరీనా వాహబ్​ ఇలా మరికొంత మంది నటీనటులు తమదైన పాత్రలతో ఆడియన్స్​ను అలరించారు. సంతోశ్​​ నారాయణన్​ సంగీతం అందించగా.. దర్శక నిర్మాతలుగా శ్రీకాంత్​ ఓదెల, సుధాకర్​ చెరుకూరి వ్యవహరించారు.

Last Updated : Apr 3, 2023, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.