ETV Bharat / entertainment

ఫిల్మ్​ ఇండస్ట్రీలోకి బాలయ్య కుమార్తె సైలెంట్ ఎంట్రీ! - నందమూరి తేజశ్విని క్రియేటివ్ కన్సల్ టెంట్​

బాలకృష్ణ అన్​స్టాపబుల్​ సీజన్​ 2 అక్టోబర్​ 14నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ షోలో బాలయ్య సరికొత్త లుక్స్​, మేనరిజంతో కనిపించి సక్సెస్​ఫుల్​ హోస్ట్​గా సూపర్​ క్రేజ్​ను దక్కించుకున్నారు. అయితే ఈ సక్సెస్​లో బాలయ్య రెండో కూతురు తేజశ్వి కీలక పాత్ర పోషించారని తెలుసా? ఇంతకీ ఆమె ఈ షో కోసం ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు? ఏం పనిచేశారు? వంటి సంగతులు తెలుసుకుందాం..

Balakrishna unstoppable 2
బాలయ్య రికార్డుల వేట వెనుక చిన్న కూతురి క్రియేటివిటీ
author img

By

Published : Oct 13, 2022, 2:21 PM IST

Updated : Oct 13, 2022, 5:38 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ విశ్వరూపాన్ని వెండితెరపై చూశాం. ఆయన నటనలోని వేరియేషన్స్ బాలయ్యను అందలమెక్కించాయి. నందమూరి వారసుడిగా, సీనియర్ స్టార్ హీరోగా అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న బాలయ్య.. ఓటీటీ వేదికపై అన్​స్టాప్​బుల్​తో అంతకుమించి క్రేజ్​ దక్కించుకున్నారు. 'చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరగరాయాలన్న మేమే' అంటూ 'సింహా'లో ఆయన చెప్పిన డైలాగ్​ అన్​స్టాపబుల్​ షోకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమంతో హోస్ట్​గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైనస్టైల్​ మేనరిజంతో ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ టాక్​ షో.. అన్ని టాక్​ షోలలో సరికొత్త రికార్డులు క్రియేట్​ చేసింది. ఆడియెన్స్​ నుంచి భారీ రెస్పాన్స్​ను సంపాదించుకుంది. సెలబ్రిటీలతో బాలయ్య ముచ్చటించిన తీరు, సరదా సెటైర్లు, పంచ్​లు.. ఆయన లుక్​, స్టైల్​, మ్యానరిజం అన్ని షోకు మేజర్​ అట్రాక్షన్​గా నిలిచాయి. అందుకే ఆయన హోస్ట్​గా భారీ రేంజ్​లో సక్సెస్​ అయి మరింత క్రేజ్​ను దక్కించుకున్నారు. అయితే ఆ సక్సెస్​లో బాలయ్య రెండో కూతురు నందమూరి తేజశ్విని కూడా కీలక పాత్ర పోషించారు.

Balakrishna unstoppable 2
బాలయ్య

క్రియేటివ్​ కన్సల్​టెంట్​గా.. సాధారణంగా బయట, మీడియాలో చాలా తక్కువగా కనిపించే ఈమె తన తండ్రిని ఓటీటీ వేదికపై విజయవంతమైన హోస్ట్​గా, స్పెషల్​ అట్రాక్షన్​గా చూపించడానికి చాలా కష్టపడ్డారు. తన ప్రతిభకు బాలయ్య నటనను జోడించి షోను అన్​స్టాపబుల్​గా దూసుకెళ్లేలా చేశారు. నిజానికి ఈ షో కోసం చాలా మందే పనిచేశారు. అందులో తేజశ్వినితో పాటు సీనియర్​ రైటర్​ బీవీఎస్​ రవి కూడా ఉన్నారు. ఆయనే స్వయంగా.. బాలయ్య విజయంలో తేజశ్విని పోషించిన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి సీజన్​ కోసం ఆమె ఎంతలా కష్టపడ్డారో కూడా వివరించారు. బాలయ్య లుక్, కాస్ట్యూమ్స్​ విషయంలో తేజశ్విని చాలా రీసెర్చ్ చేశారని తెలిపారు. ఆ క్రెడిట్ ఆమెకే వెళ్తుందని చెప్పారు! "ఆమె క్రియేటివ్​ కన్సల్​టెంట్​గా వ్యవహరించారు. మా డిస్కషన్స్​లో చురుగ్గా పాల్గొనేవారు. బాలయ్య లుక్స్​, కాస్ట్యూమ్స్​.. ఇక స్క్రిప్ట్​​ విషయాల్లో తానే చొరవ తీసుకుని సలహాలు ఇస్తూ మాతో పాటు వర్క్​ చేశారు" అని బీవీఎస్​ పేర్కొన్నారు.

Balakrishna unstoppable 2
నందమూరి తేజశ్విని

రెండో సీజన్​ కోసం.. అన్​స్టాపబుల్​ తొలి సీజన్​ సూపర్ హిట్​గా నిలిచిన తర్వాత రెండో సీజన్​ కోసం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ​అయితే ఆ ఎదురుచూపులకు తెరదించుతూ ఇటీవలే అక్టోబర్​ 14నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్​ ప్రకటన చేశారు. దానికి తగ్గట్టే షోకు సంబంధించిన అప్డేట్స్​ ఇస్తూ.. షోపై మరింత ఆసక్తిని పెంచేందుకు వరుసగా బాలయ్య లుక్స్​, పోస్టర్స్​, షోకు సంబంధించిన యాంథమ్, తొలి ఎపిసోడ్​ ప్రోమో వంటి విడుదల చేశారు. అవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రోమోలో బాలయ్య డైలాగ్స్​, లుక్స్, ఎనర్జీ​ చూసి మరింత ఆశ్చర్యపోయారు ఆడియెన్స్​.

అయితే తాజాగా ప్రోమోకు సంబంధించిన మేకింగ్​ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య షో కోసం ఎంతలా కష్టపడ్డారు, సన్నివేశాలు ఎలా తెరకెక్కించారు వంటివి చూపించారు. అయితే ఈ ప్రోమోలో బాలయ్యతో పాటు మరో వ్యక్తి కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. ఎవరంటే మన నందమూరి తేజశ్వినీనే. తొలి సీజన్​ కోసం ఎంతో చురుగ్గా పని చేసిన ఆమె రెండో సీజన్​ కోసం కూడా క్రియేటవ్​ కన్స్​ల్​టెంట్​గా అంతే చురుగ్గా పనిచేశారు. తండ్రికి ఎలాంటి లుక్స్​, గెటప్స్​, క్యాస్ట్యూమ్స్​ సెట్​ అవుతాయి సహా షోకు సంబంధించిన మిగతా విషయాల్లోనూ చురుగ్గా పర్యవేక్షిస్తూ కనిపించారు. ఇక ఈ మేకింగ్​ వీడియో చూసిన ఫ్యాన్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తొలి ఎపిసోడ్​ గ్రాండ్​గా.. ఇక తొలి ఎపిసోడ్​కు చీఫ్ గెస్ట్​గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేశ్​ వచ్చారు. అక్టోబర్​ 14న తొలి ఎపిసోడ్​ టెలికాస్ట్ కానుంది. మొదటి ఎపిసోడ్​ ప్రోమో విడదలై ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో చంద్రబాబును బాలకృష్ణ అద్భుత ఇంట్రడక్షన్ ఇచ్చి షోలోకి ఆహ్వానించారు. తన ఎనర్జీతో ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. ఈ ప్రోమో ఇప్పటివరకు 2.1కుపైగా మిలియన్​ వ్యూస్​ను దక్కించుకుని సోషల్​మీడియాలో దూసుకుపోతుంది.

ఇదీ చూడండి: ఈ కాంబో రిపీట్ అయితే సామిరంగా

Last Updated : Oct 13, 2022, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.