ETV Bharat / entertainment

అనిరుధ్​ లైనప్​.. ఎన్టీఆర్​ టు కమల్​హాసన్​.. స్టార్ హీరోలందరూ మనోడి వైపే! - ఇండియన్​ 2 అనిరుధ్​​ రవిచందర్​

ఇప్పటికే ఎన్నో హిట్​ సాంగ్స్​కు స్వరాలు సమకూర్చిన కోలీవుడ్​ మ్యూజిక్ సెన్షేషన్​​ అనిరుధ్​ రవిచందర్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం అని తేడా లేకుండా అన్ని పాన్​ ఇండియా ప్రాజెక్ట్సే చేస్తున్నారు. అగ్ర నటులు రజినీ కాంత్​, కమల్​ హాసన్​, షారుక్​ ఖాన్, విజయ్​, ఎన్టీఆర్​ సహా పలు హీరోల సినిమాలకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఆ సినిమాల వివరాలు..

Music Director Anirudh Ravichander
Music Director Anirudh Ravichander
author img

By

Published : Feb 24, 2023, 3:16 PM IST

'3' సినిమాలోని 'వై దిస్​ కొలవెరీ డీ' అనే పాట అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సౌత్​ ఇండస్ట్రీలో ఈ పాటకు శ్రోతలకు ఊర్రూతలూగిపోయారు. ఇక యూత్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి నోట ఇదే పాట. ఆ ఒక్క పాట ఆయన కెరీర్​నే మార్చేసింది. ఆ సాంగ్​ సక్సెస్​తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటినుంచి సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఆయనే కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు​ అనిరుధ్​​ రవిచందర్. ఆయన​​ మంచి కంపోజర్​తో పాటు సూపర్​ సింగర్​ కూడా. పలు సినిమాలకు హిట్​ సాంగ్స్ పాడి సంగీత ప్రియులను అలరించారు.

అనిరుధ్​ తండ్రి రవిచంద్ర రాఘవేంద్ర తమిళ ఇండస్ట్రీలో స్టార్​ యాక్టర్​​, మేనత్త సూపర్ స్టార్​ రజనీకాంత్​ భార్య లత​. ఇంకా చెప్పాలంటే ఆయన కుటుంబంలో సగం మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. అయినప్పటికీ ఎలాంటి ఇన్​ఫ్లుయెన్స్​లు వినియోగించకుండా సొంత కాళ్లపై ఎదగాలనుకున్నారు రవిచందర్. అలా తమిళ స్టార్​ హీరో ధనుశ్​​ నటించిన '3' సినిమాతో తన సంగీత ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత చేతి నిండా సినిమాలతో ఫుల్​ బిజీ అయిపోయారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ తన ట్యాలెంట్​ను చూపి టాప్​ మ్యూజిక్​ డైరెక్టర్​గా ఎదిగారు. తమిళంలో 'వనక్కం చెన్నై', 'వీఐపీ', 'మారి', 'పేటా', 'కత్తి' వంటి సూపర్ హిట్​ సినిమాలకు స్వరాలను సమకూర్చారు.​ దీంతో రవిచందర్.. తమ సినిమాకు బాణీలు కట్టాలంటూ దర్శక నిర్మాతలు అనిరుధ్ కాల్షీట్ల కోసం క్యూ కట్టడం ప్రారంభించారు. ఎందుకంటే​ లిరిక్స్​కు ఆయనిచ్చే ట్యూన్​ ఒక ఎత్తైతే.. సినిమాకు ఆయన ఇచ్చే బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ మరో ఎత్తు. సీన్ ఎలాంటిదైనా సరే.. తన మ్యూజిక్​తో ప్రేక్షకులను ఇట్టే అట్రాక్ట్​ చేస్తారు. హీరోలకు, విలన్స్​కు ఈయన ఇచ్చే బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ వేరే లెవెల్​ అనే చెప్పాలి.

అయితే, తమిళంలో బాగా ఫేమస్​ అయిన ఈ సంగీత దర్శకుడు.. పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ నటించిన 'అజ్ఞాతవాసి'తో టాలీవుడ్​లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా తర్వాత 'యూటర్న్', 'గ్యాంగ్​ లీడర్', 'జెర్సీ' లాంటి సినిమాలకు కూడా వర్క్​ చేశారు. ఇప్పుడాయన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే అనిరుధ్​తో కొలాబరేట్​ అయ్యేందుకు స్టార్​ డైరెక్టర్లు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అలా సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ సినిమా 'జైలర్'​తో పాటు బాలీవుడ్​ షారుక్ ఖాన్ 'జవాన్​', విజయ్​ 'లియో','ఎన్టీఆర్​ 30', కమల్​హాసన్​ 'ఇండియన్ 2', 'అజిత్​ ఏకే 62' సినిమాల్లో ప్రస్తుతం పని చేస్తున్నారు. ఈ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.