ETV Bharat / entertainment

Movie Director With No Flops : ప్ర‌తి సినిమా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్‌.. ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడు ఎవరంటే? - కరణ్​ జోహార్​ తాజా సినిమాలు

Movie Director With No Flops : సినీ ఇండస్ట్రీలో సీనియర్​ నుంచి అప్​కమింగ్​ వరకు ఎంతో మంది దర్శకులు ఉన్నారు. వారు తమ ట్యాలెంట్​ను ప్రదర్శించి సినిమాలను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అందులో కొన్ని హిట్ట‌యితే.. మ‌రికొన్ని మాత్రం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంటాయి. అయితే ఇంత వరకు తమ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ సినిమా లేని ద‌ర్శ‌కుడు ఒకరు ఉన్నారు. పైగా ఆయన తీసిన ప్ర‌తి సినిమా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ సాధించిందీ. ఇంత‌కీ ఆయన ఎవరంటే?

Movie Director With No Flops : తీసిన ప్ర‌తి సినిమా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్‌.. ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడు.. ఆయనెవరంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 5:29 PM IST

Updated : Sep 15, 2023, 6:18 AM IST

Movie Director With No Flops : సినీ ఇండస్ట్రీలో గెలుపోటములు సహజమే. అలాగే ద‌ర్శ‌కుల‌న్నాక‌.. హిట్లు, ఫ్లాపులు కూడా కామ‌నే. కెరీర్ ఆరంభం నుంచీ ఎంత మంచి చ‌రిత్ర ఉన్న డైరెక్ట‌ర్ అయినా సరే.. ఏదో ఒక సమ‌యంలో ప్ర‌తికూల ఫ‌లితాలు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. భారీ అంచనాలతో సినిమాలను తెరకెక్కిస్తే అవి ఒక్కోసారి ప్రేక్షకులను నిరాశ పరిచిన సమయాలు కూడా ఉంటాయి. అయితే వాటన్నింటినీ పట్టించుకోకుండా డైరెక్టర్లు తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి మంచి సినిమాలను తెరపైకి తీసుకుస్తుంటారు. కానీ ఓ డైరెక్ట‌ర్ మాత్రం ఇంత వ‌ర‌కూ ఫ్లాప్ రుచి చూడ‌లేదు. పైగా తాను తీసిన సినిమాల‌న్నీ కూడా బాక్సాఫీస్​ వద్ద రూ. 100 కోట్లకు పైగా వ‌సూలు చేసినవే. అయితే త‌న కెరీర్ లో ఒక్క ఫ్లాప్ లేని డైరెక్ట‌ర్ అన‌గానే మ‌న‌కు ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి గుర్తొస్తాడు. కానీ పైన చెప్పింది మాత్రం ఆయ‌న గురించి కాదు.

Karan Johar Directed Movies : ఆయనలాగే ఇండస్ట్రీలో మరో డైరెక్టర్​ కూడా ఉన్నారు. ఆయనే బాలీవుడ్​కి చెందిన దర్శక నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌. బీటౌన్​లో దశాబ్దాలుగా ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలను రూపొందించిన ఆయన.. ఓ దర్శకుడిగానే కాదు ఓ నిర్మాతగానూ రాణిస్తున్నారు. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమాతో అసిస్టెంట్​ డైరెక్టర్​గా తన సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించిన కరణ్​.. ఆ త‌ర్వాత 1998లో తెరకెక్కిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాతో తొలిసారి మెగాఫోన్​ పట్టారు. యూత్​లో మంచి క్రేజ్​ సంపాదించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 107 కోట్లకు మేర వసూళ్లను అందుకుని ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్​ సాధించిన భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది.

ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన 'కభీ ఖుషీ కభీ గమ్', 'కభీ అల్విదా నా కెహనా' సినిమాలు బాక్సాఫీస్​ వద్ద రూ.100 కోట్లు మార్క్​ను దాటగా.. 'మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమా ఏకంగా రూ. 223 కోట్లు సంపాదించింది. ఇక 2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో మ‌రో 100 కోట్ల మార్క్​ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. రణ్​బీర్​ కపూర్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా రూ.200 కోట్ల మార్క్‌ను దాటింది.

Karan Johar Latest Movie : ఓ వైపు దర్శకుడిగా ఉంటూనే.. ధర్మ ప్రొడక్షన్స్​ సంస్థ ద్వారా కరణ్​ అనేక హిట్​ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వ‌సూళ్లను అందుకుని.. ప్రస్తుతం రూ.400 కోట్ల మార్కు దిశ‌గా దూసుకెళుతోంది. ఇలా త‌న 25 ఏళ్ల కెరీర్​లో ఎన్నో సూపర్​ హిట్​ చిత్రాలను కరణ్​ రూపొందించారు. అవన్నీ కూడా రూ.100 కోట్ల మార్కును దాటినవే. విశేషం ఏంటంటే.. ఇందులో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక కరణ్​ తర్వాత త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్లు క‌లిగిన ద‌ర్శ‌కుడిగా బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఉన్నాడు. 'గోల్‌మాల్ 3' నుంచి 'సూర్యవంశీ' వరకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసిన తొమ్మిది చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రూ.423 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'చెన్నై ఎక్స్​ప్రెస్' సినిమా.. రోహిత్​ కెరీర్ లో అత్య‌ధిక కలెక్షన్స్​ సాధించిన సినిమాగా నిలిచింది.

సక్సెస్​కు కేరాఫ్​ అడ్రస్​​ ఈ స్టార్ డైరెక్టర్స్​.. ఒక్క ఫ్లాప్ కూడా​ లేకుండా..

Kangana Ranaut Karan Johar :'రూ.250 కోట్ల సీరియల్​ చూసేందుకు జనాలు పిచ్చోళ్లు కారు'..అందుకే..

Last Updated : Sep 15, 2023, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.