ETV Bharat / entertainment

మంచు అందాల్లో చిరు-శ్రుతి రొమాన్స్​.. 'వాల్తేరు వీరయ్య' డ్యూయెట్​ అదుర్స్​! - వాల్తేరు వీరయ్య పాటలు

మెగస్టార్​ చిరంజీవి మాస్​ గెటప్​లో​ వస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 'శ్రీదేవీ-చిరంజీవి' సాంగ్​ విడుదలైంది. జస్ప్రీత్​- సమీర​ వోకల్స్​తో సాంగ్​ అదిరిపోయింది.

waltair veerayya movie
waltair veerayya movie
author img

By

Published : Dec 19, 2022, 4:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఆయన సందడి చేశారు. ఇదే వరుసలో ఆయన నటిస్తోన్న మరో చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇదివరకే విడుదలైన ఫస్ట్​లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. ఇక బాస్​ పార్టీ సాంగ్​తో ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. 'నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవి అంట..' అంటూ సాగే ఈ పాటను జస్ప్రీత్​, సమీరా భరద్వాజ్​​ అద్భుతంగా పాడారు.

ఇక, ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు బాబీ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.