మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే ఒక్కసారిగా ఈలలు, చప్పట్లు ఆగకుండా మోగుతూనే ఉంటాయి. ఆయన అభిమానులు ఆయన్ను ముద్దుగా చిరు అని పిలుచుకుంటారు. సాధారణంగా ఇంటర్వ్యూలకు మాత్రమే హాజరయ్యే చిరు.. బుల్లితెర షోల్లో పాల్గొనడం అరుదు. అభిమానులకున్న ఈ లోటును కూడా ఆయన తీర్చేశారు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే సుమ అడ్డా సెలబ్రిటీ టాక్‌షోకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.
'మాస్ క్లాస్ గ్రేస్ కలిపితే భయ్యా వస్తున్నాడు మన వీరయ్య' అంటూ యాంకర్ సుమ చెప్పగానే ఫ్యాన్స్ కేకలతో ఒక్కసారిగా స్టేజీ దద్దరిల్లింది. అంతే వెంటనే బాస్ స్టేజ్ మీదకు వచ్చేశారు. దీంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. వాల్తేర్ వీరయ్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్‌తో 'సుమ అడ్డా'కు చిరు వచ్చారు. 'డోంట్ స్టాప్ లాఫింగ్.. సుమ అడ్డా లోడింగ్' అంటూ మెగాస్టార్ అనడం ప్రోమోలో హైలైట్ పార్ట్‌గా నిలిచింది. ఇప్పటికే రిలీజైన ప్రోమోలో చిరు జోష్ చుసిన ఫ్యాన్స్ ఇక ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈలోపు ప్రోమో చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">