ETV Bharat / entertainment

రాజకీయ నేతగా ​చరణ్​.. భారీగా తరలివచ్చిన అభిమానులు.. పోలీసుల ఆంక్షలు! - కర్నూల్​లో ఆర్​సీ 15

మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​-స్టార్ డైరెక్టర్​ శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న పొలిటికల్​ డ్రామా 'ఆర్​సీ 15'. గత కొంతకాలంగా చిత్రీకరణలో బిజీగా ఉన్న మూవీ టీమ్..​ తాజాగా కర్నూల్​లో సందడి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ram charan rc 15 shooting at kurnool
ram charan rc 15 shooting at kurnool
author img

By

Published : Feb 10, 2023, 7:52 PM IST

టాలీవుడ్​ మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్,​ స్టార్ డైరెక్టర్​ శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఆర్​సీ 15'. ఇప్పటికే పలు ప్రదేశాల్లో శరవేంగా షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను కర్నూలుకు షిప్ట్ చేశారు డైరెక్టర్ శంకర్. కర్నూల్​లోని కొండారెడ్డి బురుజు వద్ద 'ఆర్​సీ 15' టీమ్ ​సందడి చేసింది. అక్కడ అభ్యుదయ పార్టీ అంటూ బ్యానర్లు, రాజకీయ నాయకుడిగా రామ్​చరమ్​ కటౌట్లు వెలిశాయి. అయితే ఇవన్నీ షూటింగ్​లో భాగమే. షూటింగ్​ విషయం తెలుసుకుని అభిమానులు భారీగా గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. వారిని నియంత్రించేందుకు కర్నూలు పోలీసులు షూటింగ్​ జరుగుతున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. కాగా, గురువారం హైదరాబాద్​లోని చార్మినార్​ వద్ద​ షూటింగ్​ చేసిన మూవీ టీమ్​ ఇప్పుడు కర్నూల్​లో తదుపరి చిత్రీకరణను మొదలుపెట్టింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్​ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్​గా రూపొందుతోంది 'ఆర్​సీ15'. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్‌. జె. సూర్య, నవీన్​ చంద్ర, సునీల్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్‌ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా షూటింగ్​కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ ఇటీవలే మళ్ళీ కొత్త షెడ్యూల్​ను మొదలుపెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.