ETV Bharat / entertainment

'ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?'.. ఇంట్రెస్టింగ్​గా 'విరూపాక్ష' ట్రైలర్ - సాయితేజ విరూపాక్ష డైరెక్టర్​ కార్తీక్ వర్మ దండు

మెగా హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'విరూపాక్ష' కొత్త ట్రైలర్​ రిలీజై ఆకట్టుకుంటోంది. మీరు చూశారా?

Mega hero Sai Dharam tej Virupaksha trailer released
'ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?'.. ఇంట్రెస్టింగ్​గా 'విరూపాక్ష' ట్రైలర్
author img

By

Published : Apr 11, 2023, 12:04 PM IST

Updated : Apr 11, 2023, 12:42 PM IST

అనగనగా ఓ చిన్న గ్రామం. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి వచ్చిన కుటుంబం. పట్నం అబ్బాయి.. పల్లెటూరి అమ్మాయితో ప్రేమాయణం.. అంతలోనే ఆ ఊరికి పట్టిన అరిష్టమో, గ్రహచారమో.. ఆ గ్రామంలో చావులు మొదలైతాయి. మరి అక్కడ ఏం జరుగుతోంది.. అసలా చావులకు కారణం ఏంటి? వంటి ప్రశ్నలతో ఆసక్తిగా సాగింది 'విరూపాక్ష' ట్రైలర్. మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రమే 'విరూపాక్ష'. దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దీనిని తెరకెక్కిస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గిరిజన గూడెం నేపథ్యంలో సాగే కథ ఇది. రీసెంట్​ 'ధనుశ్​' సార్​ సినిమాతో సక్సెస్​ అందుకున్న సంయుక్త మేనన్.. ఈ చిత్రంతో తేజ్​ సరసన హీరోయిన్​గా నటిస్తోంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ నెల 21వ తేదీన రిలీజ్​ కానుంది.

ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్​ చేశారు మేకర్స్​. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ప్రచార చిత్రాన్ని కట్​ చేస్తున్నారు. ఆద్యంతం ఆసక్తిగా సాగే ఈ ప్రచార చిత్రం చూస్తుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్​లో హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​, స్క్రీన్​ ప్లే, లుక్స్​, సెటప్ చూస్తుంటే మంచి థ్రిల్లర్ మూవీలా కనిపిస్తోంది.

ఈ ప్రచార చిత్రంలో 'గ్రహణం విడిచేలోగా ఊరు అంతమైపోతుంది, ఊరిని అష్ట దిగ్బంధనం మూసేయాలి' అంటూ స్వామీజి చెప్పడం, 'జరుగుతున్న చావులకు నేను కారణం తెలుసుకుని తీరుతాను' అని సాయితేజ్​ అనడం, ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా' అని సునీల్ చెప్పడం.. 'జరగబోయే మారణహోమాన్ని ఎవరూ ఆపలేరు' అంటూ మరో స్వామీజి చెప్పడం.. 'చివర్లో ఈ రుద్రవణాన్ని కాపాడే విరూపాక్షవి నువ్వే' అంటూ హీరోను ఉద్దేశిస్తూ వచ్చే డైలాగ్.. ఇలా మొత్తం సన్నివేశాలు, సంభాషణలు​​ సినిమాపై బాగా ఆసక్తిని పెంచుతున్నాయి. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత చాలా గ్యాప్​ ఇచ్చి సాయితేజ్​ నుంచి వస్తున్న సినిమా ఇదే. మరి ఈ మూవీతో సాయితేజ్​ ఆకట్టుకుంటాడా లేదా అనేది చూడాలి. కాగా బీవీఎస్ ఎన్ కుమార్ - సుకుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​ను అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Honey Rose: మేడమ్ జీ.. గ్లామర్​ ట్రీట్​ సూపర్​.. త్వరగా గ్రీన్ సిగ్నల్​ ఇచ్చేయచ్చుగా?

Last Updated : Apr 11, 2023, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.