ETV Bharat / entertainment

Mark Antony Stay Order : కోర్టులో హీరో విశాల్​కు ఊరట.. ఆ రోజే 'మార్క్​ ఆంటోని' రిలీజ్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 3:12 PM IST

Updated : Sep 12, 2023, 3:22 PM IST

Mark Antony Stay Order : కోలీవుడ్ హీరో విశాల్‌కు కోర్టులో ఉపశమనం లభించింది. మార్క్ ఆంటోని విడుదలపై న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Mark Antony Stay Order : కోర్టులో హీరో విశాల్​కు ఊరట.. ఆ రోజే 'మార్క్​ ఆంటోని' రిలీజ్
Mark Antony Stay Order : కోర్టులో హీరో విశాల్​కు ఊరట.. ఆ రోజే 'మార్క్​ ఆంటోని' రిలీజ్

Mark Antony Stay Order : కోలీవుడ్ హీరో విశాల్‌కు కోర్టులో ఉపశమనం లభించింది. తన కొత్త చిత్రం మార్క్ ఆంటోని విడుదలపై మద్రాస్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు లభించింది. దీంతో మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగుమం అయింది. "మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ అయ్యేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ లెటర్ వచ్చింది. సెప్టెంబర్ 15న(Mark Antony Release Date) వరల్డ్ వైడ్​గా మార్క్ ఆంటోని చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 22న హిందీలో విడుదల అవ్వనుంది" అని విశాల్ ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే.. విశాల్‌, కోలీవుడ్‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ మధ్య కొంతకాలం కిత్రం డబ్బు విషయంలో విభేదాలు వచ్చాయి. సినిమా చేస్తానని తమ వద్ద విశాల్ రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని, ఆ డ‌బ్బు తిరిగి ఇవ్వలేదని 2022లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. మొదటి సారి జరిగిన వాదనల తర్వాత లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్‌ రూ. 15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, తన ఆస్తుల వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది చేసేంత వరకు.. విశాల్‌ నటించిన, నిర్మించిన చిత్రాలను థియేటర్లలో లేదా ఓటీటీల్లో రిలీజ్ చేయకూడదంటూ స్టే విధించింది.

అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘిస్తూ, త‌మ‌కు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఇవ్వకుండానే.. సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారని మరోసారి విశాల్‌పై లైకా సంస్థ జూన్‌ నెలలో కోర్టు ధిక్క‌ర‌ణ కేసు వేసింది. కానీ ఆ సమయంలో సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టులో ప్రవేశపెట్టలేకపోయింది. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. తాజాగా ఆ కేసు మరోసారి విచారణకు రాగా మార్క్ ఆంటోని చిత్రంపై కోర్టు స్టే విధించిందని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. కానీ ఇప్పుడు న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, సినిమా సెప్టెంబర్ 15నే రిలీజ్​ అవుతుందని విశాల్ తన ట్వీట్​తో స్పష్టం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mark Antony Cast and Crew : కాగా, దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ ఈ మార్క్ ఆంటోని చిత్రాన్ని తెరకెక్కించారు. గ్యాంగ్‌ స్టర్‌, టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సినిమా రూపొందింది. విభిన్నమైన లుక్స్‌లో విశాల్​ కనిపించనున్నారు. రీతూవర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సెల్వరాఘవన్‌ కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్​కు మంచి స్పందన రావడం వల్ల సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.
Vishal Marriage Rumors : 'ఆమె'తో పెళ్లి రూమర్స్​పై హీరో విశాల్ క్లారిటీ

హీరో విశాల్​కు ఆ చెడ్డ అలవాటు ఉందా.. రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్​!

Last Updated : Sep 12, 2023, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.