ETV Bharat / entertainment

సాంగ్​ షూటింగ్​లో పవన్​, మహేశ్​ బిజీ బిజీ! - మహేశ్​బాబు సర్కారు వారి పాట

సూపర్​స్టార్​ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట', పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాల షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం భారీ సెట్స్​లో సాంగ్స్​ చిత్రీకరిస్తున్నారని తెలిసింది.

Maheshbabu Sarkaru vari pata
సాంగ్​ షూటింగ్స్​లో పవన్​, మహేశ్​ బిజీ బిజీ
author img

By

Published : Apr 19, 2022, 11:04 AM IST

Updated : Apr 19, 2022, 11:15 AM IST

Mahesh Babu Sarkaru vaaripata movie: ఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్​ ఇచ్చే పనిలో బిజీ అయ్యారు 'సర్కారు వారి పాట' మేకర్స్​. ఇందుకోసం మహేశ్​ బాబు, కీర్తి సురేశ్​పై ఓ మాస్​ సాంగ్​ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. శేఖర్​ మాస్టర్​ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో ట్వీట్​ చేశారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయితే గుమ్మడికాయ కొడతారని తెలిసింది. కాగా, ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా.. తమన్ సంగీతమందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ.. మే 12న థియేటర్లలోకి రానుంది.

choreo grapher Shekar master
కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​
sarkaru vaari pata
సర్కారు వారి పాట

Pawankalyan Harihara veeramallu movie: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, క్రిష్​ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్​ సినిమా 'హరిహర వీరమల్లు'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. కొత్త షెడ్యూల్​ను ప్రారంభించుకోనుందట! ఇందులో పవన్​ పాత్రను ఎలివేట్​ చేస్తూ ఓ సోలో సాంగ్​ను కూడా చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసం భారీ సెట్​ను నిర్మించారు. ఇక ఈ షెడ్యూల్​లో​ హీరోయిన్​ నిధి అగర్వాల్​పైనా సీన్స్​ను చిత్రీకరించనున్నారు.

కాగా, పవన్‌ నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎ.దయాకర్‌రావు, ఎ.ఎమ్‌.రత్నం నిర్మాతలు. బాలీవుడ్‌ తారలు అర్జున్‌ రాంపాల్‌, నర్గీస్‌ ఫక్రీ కూడా ఇందులో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా పలు చారిత్రక కట్టడాల్ని సెట్స్‌గా తీర్చిదిద్దుతూ చిత్రీకరణ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ వారం థియేటర్​/ఓటీటీలో రిలీజ్​ అయ్యే చిత్రాలివే!

Last Updated : Apr 19, 2022, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.