ETV Bharat / entertainment

బాగా కావాల్సిన వాళ్లంతా దూరమైపోతున్నారు.. కంటతడి పెట్టుకున్న మహేశ్​ - super star krishna death news

సూపర్​స్టార్ కృష్ణ కన్నుమూయడం వల్ల ఆయన అభిమానులు, సినీపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఆయన కుటుంబసభ్యులు, తనయుడు మహేశ్​బాబు.. కృష్ణ భౌతికకాయం వద్ద కన్నీరు పెట్టుకుంటున్నారు.

Maheshbabu emotional about his father
బాగా కావాల్సిన వాళ్లంతా దూరమైపోతున్నారు.. కంటతడి పెట్టుకున్న మహేశ్​
author img

By

Published : Nov 15, 2022, 3:20 PM IST

Updated : Nov 15, 2022, 3:34 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే తల్లి, సోదరుడిని పోగొట్టుకున్న మహేశ్‌ ఇప్పుడు తండ్రిని కూడా పోగొట్టుకున్నారు. గతకొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సూపర్‌స్టార్‌ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో ఘట్టమనేని ఇంట విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని మహేశ్‌బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తన తండ్రి కృష్ణను మహేశ్‌బాబుఎంతగానో ఆరాధించేవారు. నాన్నే నా దేవుడు అంటుండేవారు. అంతగా ప్రేమించే వ్యక్తి మహేశ్‌కు దూరమయ్యారు.

అయితే కృష్ణ మరణంతో.. సినీ ప్రముఖులు, అభిమానులు కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మరికొందరు.. పలు సందర్భాల్లో తన తండ్రి గురించి మహేశ్‌ చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలు, వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఓ వేదికపై "కృష్ణగారి అబ్బాయి అనే నేను" అంటూ మహేశ్‌ ప్రసంగించే దృశ్యాలు, 'మురారి’ సినిమా చూశాక నాన్న నా భుజంపై చేయి వేశారంతే. ఏం మాట్లాడలేదు. ఆయనకు నా నటన నచ్చిందని అర్థమైంది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి" అని ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌ చెప్పిన మాటలు నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

మహేశ్​కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. సోదరుడు రమేశ్‌బాబు మరణించిన సమయంలో మహేశ్‌ ఓ కార్యక్రమంలో పాల్గొని స్టేజ్ పైన ఎమోషనల్​గా మాట్లాడారు. 'నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు' అంటూ అభిమానులనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదీ చూడండి: అలా చేయకపోవడం వల్ల కృష్ణ చాలా నష్టపోయారట.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలివే

Last Updated : Nov 15, 2022, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.