Maheshbabu Sitara Dance show సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు.. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న ఆయన రీల్ లైఫ్‌లోనే కాకుండా రీయల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నారు. ఆయన కూతురు సితార ఘట్టమనేని కూడా సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది. అయితే మహేశ్ బాబు, సితార కలిసి సోషల్‌మీడియాలో తప్ప ఒకే స్టేజిపై కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఓ షోలో కనిపించనున్నారు.
ఇప్పటికే బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో మహేశ్ బాబు పాల్గొన్నారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన.. 'మీలో ఎవరు కోటేశ్వరుడు' షోలో పాల్గొన్నారు. ఇటీవల బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్' కార్యక్రమంలో పాల్గొన్ని సందండి చేశారు. ఇప్పుడు మరోసారి తాజాగా మరో గెస్ట్‌గా రాబోతున్నారు. అయితే ఈ సారి మాత్రం సింగిల్‌గా కాకుండా తనతో పాటు తన కుమార్తె సితారను కూడా తీసుకొచ్చారు. ఓ ఛానల్లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోకు ముఖ్య అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదైలంది. ఇది చూసిన మహేశ్ అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు.
కాగా, సితారకు డ్యాన్స్ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ చిన్నారి కూచిపూడి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఓ సందర్భంలోనూ మహేశ్ కూడా సితారకు డ్యాన్స్ అంటే ఇష్టమని వెల్లడించారు.
-
Babu In Zee Telugu New Dance Show 🔥 🔥#SSMB28 @urstrulyMahesh pic.twitter.com/TBqvmnEBma
— I'M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) August 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Babu In Zee Telugu New Dance Show 🔥 🔥#SSMB28 @urstrulyMahesh pic.twitter.com/TBqvmnEBma
— I'M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) August 28, 2022Babu In Zee Telugu New Dance Show 🔥 🔥#SSMB28 @urstrulyMahesh pic.twitter.com/TBqvmnEBma
— I'M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) August 28, 2022
ఇదీ చూడండి: పఠాన్ కోసం షారుక్ అదిరిపోయే స్కెచ్, బాయ్‌కాట్ నుంచి తప్పించుకుంటారా