ETV Bharat / entertainment

కావాలంటే రాసుకోండి.. అది జరగడం పక్కా!: మహేశ్​బాబు

Sarkaru vaaripata movie pre release event: సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ సహా మూవీటీమ్​ సినిమా గురించి పలు విశేషాలను తెలిపారు. ఆ సంగతులివీ.. ​

Sarkaru vaaripata movie pre release event
మహేశ్​ బాబు సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్
author img

By

Published : May 8, 2022, 7:12 AM IST

Mahesh babu Sarkaru vaaripata movie pre release event: "ఈ రెండేళ్లలో చాలా జరిగాయి.. చాలా మారాయి.. నాకు బాగా దగ్గరైన వాళ్లు దూరమయ్యారు. ఏది జరిగినా, ఏది మారినా మీ అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్తా" అంటూ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్‌ కథానాయిక. తమన్‌ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ.. "మే 12న మీకు నచ్చే సినిమా రాబోతోంది. మళ్లీ మనందరికీ పండగే. మీ ఆశీస్సులు, అభిమానం నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నా. 'సర్కారువారి పాట'లో పరశురామ్‌ నా పాత్రను కొత్తగా డిజైన్‌ చేశారు. ఇందులో నటిస్తున్నప్పుడు 'పోకిరి' నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. కథ చెప్పిన తర్వాత ఆయన ఒక మెస్సేజ్‌ చేశారు. 'ఒక్కడు సినిమా చూసి బండెక్కి దర్శకుడిని అవుదామని వచ్చా. మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఎలా తీస్తానో చూడండి' అన్నారు. అన్నట్లుగానే నా అభిమానులు గర్వపడేలా సినిమా తీశారు. హీరో-హీరోయిన్‌ ట్రాక్‌ కోసం రిపీటెడ్‌ ఆడియన్స్‌ ఉంటారు. కావాలంటే రాసుకోండి. కీర్తి సురేశ్‌ పాత్ర, నటన సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. తమన్‌ ఇప్పుడొక సెన్సేషన్‌. ఆయన నేపథ్య సంగీతానికి నేనొక ఫ్యాన్‌ను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆయన ఉన్నారు.. ఆయన విన్నారు: కీర్తి సురేశ్‌
"మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయాలని చాలా సార్లు అనుకున్నా. కానీ కుదరలేదు. ‘సర్కారువారి పాట’తో పనిచేసే అవకాశం లభించింది. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు దర్శకుడు పరశురామ్‌కు ధన్యవాదాలు. రెండేళ్ల నుంచి మహేశ్‌ సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. అందుకోసం ఆయన ఉన్నారు.. ఆయన విన్నారు.. ఆయన మీ ముందుకు వస్తున్నారు.. మే12న థియేటర్‌లో సినిమా చూడండి." కథానాయిక కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చింది.

ఫోన్‌ చేసిన 'పోకిరి'లా ఉందని చెప్పారు: పరశురామ్‌
దర్శకుడు పరశురామ్‌ మాట్లాడుతూ.. "గీత గోవింద తర్వాత ‘సర్కారువారి పాట’ కథ రాసి, మహేశ్‌బాబును కలవాలనుకున్న సమయంలో కొరటాల శివ సాయం చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. కథ చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. సినిమా ఆయన క్యారెక్టరైజేషన్‌ చెబుతుంటే ఐదు నిమిషాల తర్వాత బాబు ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నన్ను ఇంత నమ్మినందుకు ఎప్పటికీ కృతజ్ఞతలు. నా విజన్‌ను తెరపై చూపించటం కోసం ఈ సినిమాకు అడిగినదంతా ఇచ్చిన నిర్మాతలకు, నా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు, సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌లకు ధన్యవాదాలు. లాక్‌డౌన్‌ సమయంలోనే తమన్‌ ఇందులోని పాటలను కంపోజ్‌ చేశాడు. వాటి బట్టే కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను అనుకున్నాం. నేపథ్య సంగీతం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమాను ఎడిటింగ్‌ చేస్తున్న మార్తాండ్‌కె వెంకటేశ్‌ చూడగానే ఫోన్‌ చేసి ‘పోకిరి’లా ఉందని చెప్పారు. అలాగే నాతో కలిసి పని చేసిన వాసువర్మకు కూడా కృతజ్ఞతలు" అన్నారు.

మహేశ్‌ పాన్‌ ఆడియన్‌ యాక్టర్‌: సుధీర్‌బాబు
"‘ఈ సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసి ‘వింటేజ్‌ మహేశ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని టాక్‌ వినిపిస్తోంది. కానీ, అందుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే మహేశ్‌ ఎలాంటి పాత్ర అయినా, సబ్జెక్ట్‌ అయినా చేస్తారు. ఇటీవల పాన్‌ ఇండియా అనే మాట కూడా వినిపిస్తోంది. కానీ, మహేశ్‌ విషయానికి వస్తే, మహేశ్‌ పాన్‌ ఆడియన్‌ యాక్టర్‌. ఎందుకంటే మహేశ్‌ క్లాస్‌సినిమా చేస్తే, మనం క్లాస్‌ ఆడియన్స్‌, మాస్‌ సినిమా చేస్తే మాస్‌ ఆడియన్స్‌ అయిపోతాం. ఈ సినిమాలో మా అబ్బాయి దర్శన్‌ చిన్నప్పటి మహేశ్‌గా నటించాడు. దర్శన్‌ ఎంపికైనట్లు మహేశ్‌, నమ్రతలకు తెలియదు. ఇందులో నెపోటిజం ఏమీ లేదు. అలా అంటే నేను ఒప్పుకోను. ఈ సినిమాలో దర్శన్‌ ఎన్ని సీన్లలో కనిపిస్తాడో తెలియదు కానీ, వాడిని చూస్తే కృష్ణగారి చూసినట్లే ఉంటుంది" అని సుధీర్‌బాబు అన్నారు.

'సర్కారువారి పాట' ఘన విజయం సాధించాలని కోరుకుంటూ దర్శకులు అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేశ్‌, గోపీచంద్‌ మలినేని, బుచ్చిబాబులు శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో ఆది శేషగిరి రావు, అశోక్‌ గల్లా, సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ‘మేజర్‌’ నటుడు అడవి శేష్‌ ఈ సందర్భంగా మహేశ్‌బాబును పలు ప్రశ్నలు అడిగారు.

ఇదీ చూడండి: అభిమానులకు మహేశ్‌ లేఖ.. పెళ్లి రూమర్లకు సాయిపల్లవి చెక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.