ETV Bharat / entertainment

మహేశ్​ 'గుంటూరు కారం'లో పొలిటికల్ టచ్​!.. కొత్త పోస్టర్​ చూశారా? - గుంటూరు కారం మూవీ

మహేశ్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమాకు సంబంధించి ఓ పోస్టర్​ ట్రెండింగ్ అవుతోంది. ఆ వివరాలు..

Guntur karam story
'గుంటూరు కారం'కు పొలిటికల్ టచ్​!
author img

By

Published : Jul 19, 2023, 11:38 AM IST

Updated : Jul 19, 2023, 12:00 PM IST

Guntur karam story : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్​ మూవీ 'గుంటూరు కారం'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి షూటింగ్​ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. ఫలితంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే పక్కా మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రానున్న ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే మహేశ్​ పాత్రకు సంబంధించిన లుక్​ కూడా రిలీజైంది. అయితే ఆ మధ్యలో ఈ సినిమా పొలిటికల్​ నేపథ్యంలో కూడా ఉంటుందని ప్రచారం సాగింది. తాజాగా ఆ ప్రచారం మరోసారి ఊపందుకుంది.

మరో కొత్త పోస్టర్​.. ఎందుకంటే సోషల్​మీడియాలో తాజాగా ఓ కొత్త పోస్టర్​ కనిపించింది. ఇందులో సీనియర్​ నటుడు ప్రకాశ్​ రాజ్​ రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్న ఓ ఫ్లెక్సీ కనపడుతోంది. ఇందులో గుంటూరు కారం సినిమాలోని పోస్టర్​ అని చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీలో 'ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా' అని అందులో రాసి ఉంది. అంటే ప్రకాశ్​ రాజ్​.. శ్రీ వైర వెంకట స్వామి అనే రాజకీయ నేతగా కనిపిస్తారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు ​ 'గంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర కథ మొత్తం.. గుంటూరు చుట్టు పక్కల సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుత పోస్టర్​లో నిజమాబాద్​ జిల్లా అని రాయడాన్ని కూడా నెటిజన్లు గమనిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్​ బ్యాక్​డ్రాప్ కాస్త లైట్​గా టచ్​ చేస్తారని అనుకుంటున్నారు. ​

ఇకపోతే గతంలోనే ఈ సినిమా రాజకీయ​ నేపథ్యంలో ఉండొచ్చని కథనాలు వచ్చాయి. ఆ సమయంలో మూవీ టైటిల్​ గురించి పెద్ద చర్చే కొనసాగింది. 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ అయితే తెగ ట్రెండ్ అయింది. ఇక ఇదే సమయంలో ఏపీ పాలిటిక్స్​లో రాజధాని విషయమై అమరావతి పేరు.. ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అందుకే ఈ పేరు​ వల్ల ఎటువంటి వివాదాలు తలెత్తకూడదని .. దాన్ని పక్కనపెట్టి 'గుంటూరు కారం' టైటిల్​ను ఫిక్స్​ చేసింది మూవీటీమ్.

Trivikram maheshbabu movie : మహేశ్‌ బాబు -త్రివిక్రమ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ చిత్రంగా గుంటూరు కారం రావడం.. సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్, గ్లింప్స్​ ఫ్యాన్స్​ను బాగానే అలరించాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

Gunturu karam Mahesh babu
మహేశ్​ 'గుంటూరు కారం'కు పొలిటికల్ టచ్​!.. కొత్త పోస్టర్​ చూశారా?

ఇదీ చూడండి :

'గుంటూరు కారం'-'హరిహర వీరమల్లు' అప్డేట్​ లీక్.. నిధి అగర్వాల్​, మీనాక్షి చెప్పేశారుగా!

'గుంటూరు కారం'లో ఆ స్టార్​ హీరో​.. మహేశ్​ను మించి యాక్టింగ్​..

Last Updated : Jul 19, 2023, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.