Koratala Siva On Sana Kastam Song: మెగా ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఓ పవర్‌ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన 'ఆచార్య' ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమాలో పాటలన్నీ బాగున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా 'ఆచార్య'లోని ఐటెమ్ సాంగ్‌కు భిన్నాభిప్రాయాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాట చాలా బాగుందని, వింటేజ్ చిరంజీవిని చూసినట్లు ఉందని కొంతమంది మెచ్చుకోగా.. మరికొంతమంది మాత్రం నక్సలిజం సిద్ధాంతాలు కలిగిన 'ఆచార్య' అనే వ్యక్తికి ఐటెమ్ సాంగ్ ఎందుకు? అని ప్రశ్నించారు. ఇదే విషయంపై కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
''చిరంజీవికి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అనగానే ఫైట్స్, డ్యాన్స్‌లు.. ఇలా కొన్ని ఎలిమెంట్స్‌ని తప్పకుండా అభిమానులు కోరుకొంటారు. దానికి అనుగుణంగానే ఆయన ఇమేజ్‌కి ఏమాత్రం భంగం లేకుండా 'సానా కష్టం' పాటను క్రియేట్ చేశాం. నేను రాసుకున్న కథకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పాత్ర ఉద్దేశాన్ని దెబ్బతీయకుండా.. తన తోటి కామ్రేడ్ ఇంట్లో శుభకార్యానికి 'ఆచార్య' వెళ్లడం.. అక్కడ సరదాగా డ్యాన్స్ చేయడాన్నే ఈ పాటలో చూపించాం'' అని శివ పేర్కొన్నారు. రేవంత్, గీతామాధురి అలపించిన ఈ పాటకి మెగాస్టార్‌తో కలిసి రెజీనా స్టెప్పులేశారు.
సత్యదేవ్‌ను మెచ్చుకున్న చిరు.. నటనలో వైవిధ్యాన్ని చూపించి, అనతికాలంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్‌ని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. సత్యదేవ్‌ని ప్రశంసిస్తూ గురువారం ట్వీట్ చేశారు. చిరు ప్రధాన పాత్రలో నటించిన 'ఆచార్య'లో సత్యదేవ్ అతిథి పాత్ర పోషించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం సత్యదేవ్.. ''అన్నయ్యా.. నటన, జీవితంలో మాలాంటి ఎందరికో మీరు ఆచార్య. ఒక అభిమానిగా చిరకాలం మీ పేరునే తలచుకుంటాను. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు మీరు నటించిన 'ఆచార్య'లో కొద్దిసేపైనా మీతోపాటు కలిసి స్క్రీన్‌షేర్ చేసుకునే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గరగా నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది'' అని ట్వీట్ చేశారు.
కాగా, సత్యదేవ్ ట్వీట్‌పై చిరంజీవి స్పందించారు. ''డియర్ సత్యదేవ్.. థ్యాంక్యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. 'ఆచార్య'లో తక్కువ నిడివి గల పాత్రలోనైనా నువ్వు కనిపించడం కూడా ఆనందాన్ని ఇచ్చింది. 'గాడ్‌ఫాదర్'లో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం గర్వకారణంగా ఉంది'' అని చిరు రిప్లై ఇచ్చారు. మలయాళీ రీమేక్‌గా సిద్ధమవుతోన్న 'గాడ్‌ఫాదర్' చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇవీ చదవండి: 'సర్కారు వారి పాట' ట్రైలర్ అప్డేట్.. 'సమ్మతమే' రిలీజ్ డేట్ ఫిక్స్
'సామ్.. ఏం మాయ చేశావో'.. అంటూ స్టార్ హీరో బర్త్‌డే విషెస్!