ETV Bharat / entertainment

'రాఖీభాయ్'​కు బాక్సాఫీస్​ సలాం- హిందీలో ఆమిర్​ఖాన్​ రికార్డ్​ బద్దలు

KGF-2 collections: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన 'కేజీఎఫ్​-2' మొదటిరోజు కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్​లో అయితే.. అమిర్​ సినిమా కంటే భారీ వసూళ్లను మూటగట్టుకుంది. ఇతర రాష్ట్రాల్లోనూ సినిమాకు.. అంచనాలకు మించి ఆదరణ దక్కింది.

kgf 2
'కేజీఎఫ్​-2'
author img

By

Published : Apr 15, 2022, 3:50 PM IST

Updated : Apr 15, 2022, 10:53 PM IST

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'కేజీఎఫ్​-2' మొదటిరోజు సూపర్​ హిట్ టాక్​​ తెచ్చుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్​ను షేక్​ చేస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోందని ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్​లో అయితే హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని.. వసూళ్లను రాబడుతోంది. తొలిరోజే అక్కడ ఏకంగా రూ.53.95కోట్లను రాబట్టినట్లు ట్రేడ్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వసూళ్ల సునామితో.. తొలి కలెక్షన్లలో ఉత్తరాదిన 'కేజీఎఫ్​-2' సరికొత్త మైలు రాయికి చేరుకుంది. 'కేజీఎఫ్​-1' ఫుల్​రన్​లో రూ. 44.09కోట్ల వసూళ్లను సాధించగా.. 'చాప్టర్​-2'కు ఒక్క మొదటిరోజే..రూ.53.95కోట్ల కలెక్షన్లు రావడం గమనార్హం.

దేశంలోని అన్ని భాషల్లో కలిసి.. మొదటి రోజు రూ. 134 కోట్ల గ్రాస్​ను రాబట్టింది ఈ సినిమా. అయితే ఓవర్సీస్​ లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. ఆ లెక్కలు కూడా వస్తే మొత్తం వసూళ్లూ.. రూ.150 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కేజీఎఫ్​-2 దాదాపు రూ. 30 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్​ నిపుణుల అంచనా. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిపి.. మరో రూ.40 కోట్ల గ్రాస్​ వచ్చినట్లు సమాచారం. బుధవారం రాత్రి నుంచే అమెరికా, యూకే, ఓవర్సీస్‌లోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్లు మొదలయ్యాయి. అక్కడ కూడా భారీగా టికెట్లు తెగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్​లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..

  • కేజీఎఫ్​ -రూ.53.95
  • వార్​ -రూ.51.60
  • థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ -రూ.50.75

హిందీలో భారీగా వసూళ్లు రాబట్టిన దక్షిణాది సినిమాలు ఇవే..

  • బాహుబలి-2( ఫుల్​ రన్​లో) - రూ.510 కోట్లు
  • ఆర్​ఆర్​ఆర్​( మూడు వారాల్లో ) - రూ. 245.32కోట్లు
  • 2.0 ( ఫుల్​ రన్​లో) - రూ.189కోట్లు
  • సాహో ( ఫుల్​ రన్​లో) - రూ. 150.6కోట్లు
  • బాహుబలి-1 ( ఫుల్​ రన్​లో) - రూ.115కోట్లు
  • పుష్ప ( ఫుల్​ రన్​లో) - రూ.108కోట్లు
  • కేజీఎఫ్​-2( మొదటి రోజు) - రూ. 53.95కోట్లు
  • కేజీఎఫ్​ ( ఫుల్​ రన్​లో) - రూ. 45కోట్లు

ఇదీ చడవండి: తమిళ్​లోకి 'ఆహా' ఎంట్రీ.. సీఎం చేతులమీదుగా ప్రారంభం

Last Updated : Apr 15, 2022, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.