ETV Bharat / entertainment

10 రోజుల షూటింగ్​.. రూ.20 కోట్ల రెమ్యునరేషన్​.. ఈ యంగ్​ హీరోకి భారీ డిమాండ్​! - kartik aaryan news

బాలీవుడ్ స్టార్​ హీరో కార్తిక్​ ఆర్యన్​.. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగరయ్యారు. యంగ్​ హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఆయన సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్​ గురించి చెప్పి అందరినీ ఆశ్యర్యపరిచారు.

kartik-aaryan-speaks-about-his-remuneration

author img

By

Published : Jan 22, 2023, 4:41 PM IST

'భూల్​ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా మారారు చాక్లెట్‌ బాయ్‌ కార్తిక్‌ ఆర్యన్‌. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్​ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్​ తర్వాత భారీ విజయాన్ని అందించింది. తాజాగా ఈ యంగ్‌ హీరో రెమ్యునరేషన్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తన తొలి చిత్రం 'ప్యార్ కా పంచనామా(2011)'కు కేవలం రూ.1.25 లక్షలు తీసుకున్న కార్తిక్‌... పాండమిక్ టైమ్‌లో చిత్రీకరించిన ఓ సినిమా కోసం ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "పాండమిక్‌ సమయంలో నటించిన సినిమా కోసం రూ.20 కోట్ల పారితోషికం తీసుకున్న మాట వాస్తవమే. ఆ సినిమాను 10 రోజుల్లో పూర్తి చేశాను. దాని వల్ల నిర్మాతలకు చాలా లాభాలు వచ్చాయి. కాబట్టి నేను ఆ స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకోవడంలో తప్పులేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి ఎంతో కష్టపడుతున్నాను. అందుకే ప్రేక్షకులు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. కార్తిక్‌ ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన 'ఆషికి 3'తో పాటు కృతి సనన్‌తో షెహజాదా చిత్రంలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రానికి హిందీ రీమేక్‌గా షెహజాదా తెరకెక్కుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.