బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న..'కాఫీ విత్ కరణ్' జులై 7నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతంది. హిందీలో అత్యంత పాపులారిటీ పొందిన షో ఇది. అయితే ఈ షో ప్రమోషన్స్‌లో భాగంగా.. కరణ్ జోహార్ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆలియా భట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లండిచారు. ఆలియా భట్‌తో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆలియా భట్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకునే వ్యక్తుల్లో కరణ్ ముందు వరుసలో ఉంటారు. రణ్‌బీర్ కపూర్- ఆలియా పెళ్లిలో కరణ్ జోహార్ హడావుడి మామూలుగా లేదు. ఈ క్రమంలో తాజాగా ఆలియా తన ప్రెగ్నెన్సీ గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసినప్పుడు కరణ్ జోహార్ చాలా భావోద్వేగానికి గురయ్యారట. 17 ఏళ్ల అమ్మాయిగా తన నా ఆఫీసులోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆలియాను చూస్తున్నానని చెప్పారు. అప్పటి నుంచి ఆలియాను నా కూతురుగా చూసుకుంటున్నానని వివరించారు. ఆమె తన మొదటి బిడ్డ అని కరణ్ జోహార్ భావోద్వేగానికి గురయ్యారు.
" నేను నా ఆఫీసులో కూర్చొని ఉన్నా. ఆలియా వచ్చింది. తల్లి కాబోతున్న శుభవార్తని నాకు చెప్పింది. నాకు కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆలియాను ఒక అమ్మాయిగా.. నటిగా.. ఇప్పుడు ఓ తల్లిగా మారడం చూస్తున్నా.. అందుకే కన్నీళ్లను ఆపుకోలేకపోయా. అదే విషయాన్ని ఆలియాకు కూడా చెప్పా."
- కరణ్ జోహార్, నిర్మాత
ఆలియా బిడ్డను తన చేతుల్లోకి తీసుకోవడానికి తాను వేచి ఉండలేనని చెప్పారు కరణ్. అలియా 'స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాకి దర్శకుడు కరణ్ జోహారే. అప్పటి నుంచి వారిమధ్య మంచి బంధం ఉంది. 'కాఫీ విత్ కరణ్' షో సీజన్ 7 తొలి ఎపిసోడ్లో అతిథిలుగా ఆలియా, రణ్వీర్ సింగ్ సందడి చేయనున్నారు.
ఇదీ చదవండి: 'పజువూరు రాణి నందిని'.. యువరాణి ఆహార్యంలో మెరిసిన ఐశ్వర్యరాయ్