ETV Bharat / entertainment

అఖిల్​ బాలీవుడ్​ ఎంట్రీకి ప్లాన్​.. ఆ బడా నిర్మాతతో నాగార్జున చర్చలు! - అఖిల్ అక్కినేని ఏజెంట్​ అప్టేట్​

త్వరలోనే 'ఏజెంట్​'తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన అక్కినేని అఖిల్​ గురించి అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీతో బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో కోసం అఖిల్​ తండ్రి హీరో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి బీటౌన్​కు చెందిన ఓ​ ప్రముఖ నిర్మాతతో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

akhil bollywood entry
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ
author img

By

Published : Sep 20, 2022, 3:21 PM IST

అక్కినేని న‌ట‌ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో అక్కినేని అఖిల్. కింగ్ నాగార్జున రొమాంటిక్ ఇమేజ్​ను కంటీన్యూ చేస్తూ అమ్మాయిల మనసు దోచుకున్నాడు కానీ ఇప్పటివరకు సరైన భారీ హిట్ పడలేదు. కెరీర్.. ప్రారంభం నుంచి కాస్త డల్​గా సాగుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్​తో కాస్త ఊర‌ట‌ లభించింది. ప్రస్తుతం 'ఏజెంట్'​తో భారీ హిట్​ కొట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం శారీరకంగా ధృఢంగా తయారయ్యాడు. ఆరు పలకల దేహాంతో రఫ్​ అండ్ రగ్డ్​ లుక్​లోకి మారిపోయాడు. అయితే ఇదంతా ఏజంట్ కోసమే కాదట. బాలీవుడ్ ఎంట్రీకి కూడా అని తెలిసింది. అవును మీరు చదివింది నిజమే. తాజాగా అఖిల్​ గురించి అదిరిపోయే ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఏజెంట్ తర్వాత​ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం స్వయంగా నాగార్జున రంగంలోకి దిగి బీటౌన్​ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్​ జోహార్​తో చర్చలు కూడా జరుపుతున్నారట. దీనికి కరణ్​ కూడా సుముఖంగా ఉన్నారని తెలిసింది.

ఇకపోతే కరణ్​ జోహార్​.. ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్​ స్టార్​ కిడ్స్​ను వెండితెరకు పరిచయం చేశారు. బాహుబలితో తెలుగు సినీపరిశ్రమ పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాక.. ఆయన​ ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్​ కూడా ఎక్కువ పెట్టారు. ఇక్కడి సినిమాలు అక్కడ.. అక్కడి సినిమాలు ఇక్కడ ప్రమోట్ చేస్తూ.. రెండు ఇండస్ట్రీల మధ్య మైత్రీ బంధం బలపడేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే లైగర్‌ సినిమా ద్వారా విజయ్‌ దేవరకొండను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. అలానే ఇప్పుడు అఖిల్‌ అక్కినేనిని కూడా హిందీలో లాంచ్​ చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అందుకే నాగ్​-కరణ్​ కలిసి ఈ విషయంపై విసృతంగా చర్చలు జరుపుతున్నారట. మరి ఇది వర్కౌట్​ అవుతదో లేదో చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ఇక ఏజెంట్ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇందులో అఖిల్‌ పరిచయ సన్నివేశాల కోసం చిత్రబృందం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండంటూ ఫ్యాన్స్‌కు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలవ్వనుంది. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇదీ చూడండి: 'ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది'.. ఐరాస సమావేశంలో ప్రియాంక చోప్రా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.