ETV Bharat / entertainment

F3 సక్సెస్​ సెలబ్రేషన్స్​.. 'విక్రమ్'​ సాంగ్​ రిలీజ్​.. 'బ్రహ్మాస్త్ర' ప్రోమో - కమల్​హాసన్​

Cinema Updates: సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో కమల్ హాసన్​ 'విక్రమ్'​, రణ్​బీర్​-అలియా 'బ్రహ్మాస్త్ర', విశ్వక్​ సేన్​ 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. మరోవైపు, కేక్ కట్ చేసి 'ఎఫ్ 3' విజయోత్సవం జరుపుకున్నారు దిల్​రాజు, వెంకటేశ్​, వరుణ్​తేజ్​.

Kamal Hasan Vikram Song
Kamal Hasan Vikram Song
author img

By

Published : May 27, 2022, 6:33 PM IST

F3 Movie Success Celebrations: 'ఎఫ్ 2' కంటే 'ఎఫ్ 3' ఘన విజయం సాధించబోతుందని ఆ చిత్ర దర్శక నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 'ఎఫ్​ 3' విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారని నిర్మాత దిల్​రాజు తెలిపారు. కథ విన్నప్పుడు ఎలాంటి అంచనాలున్నాయో రిలీజ్ రోజు ఆ అంచనాలు నిజమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. కథానాయకులు విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్​తో కలిసి తన కార్యాలయంలో కేక్ కట్ చేసి 'ఎఫ్ 3' విజయోత్సవం జరుపుకున్నారు దిల్​రాజు. 'ఎఫ్ 3' చిత్రం పిల్లలు, పెద్దలందరికీ నచ్చుతుందని, మళ్లీ మళ్లీ చూస్తారని వెంకటేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కమల్​ 'విక్రమ్​' సాంగ్​.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు విశ్వనటుడు కమల్‌హాసన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'విక్రమ్‌'. లోకేశ్‌ కనకరాజ్​ దర్శకుడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'విక్రమ్‌' తెలుగు వెర్షన్ నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'మత్తుగా మత్తుగా' అంటూ సాగే ఈ పాటను కమల్‌ హాసన్‌ ఆలపించారు. చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా, అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో కమల్‌ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'బ్రహ్మాస్త్ర' కుంకుమలా సాంగ్​.. బ్ర‌హ్మాస్త్ర సినిమాతో సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు ర‌ణ్‌బీర్ ​క‌పూర్‌, అలియా భ‌ట్‌. పెళ్లి త‌ర్వాత వీరిద్దరి కలయికలో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా ఇదే కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల‌ కానుంది. దక్షిణాది భాషలకు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి కుంకుమ‌లా పాట‌ను శుక్ర‌వారం ఆయన విడుద‌ల‌ చేశారు.

ఫుల్ సాంగ్​ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం జరిగింది. 2018లో షూటింగ్ మొదలుపెట్టారు. ట్రయాలజీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మొదటి భాగాన్ని బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్​తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఓటీటీలో అర్జున కల్యాణం.. ఈ వేసవిలో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు విద్యాసాగర్‌ చింతా తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. 'ఆహా'లో జూన్‌ 3 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను షేర్‌ చేసింది 'ఆహా'. భోగవల్లి బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్సార్‌ థిల్లాన్‌, రితికా నాయక్‌ నాయికలుగా మెరిసి, విశేషంగా ఆకట్టుకున్నారు. గోపరాజు రమణ, కేదార్‌ శంకర్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇవీ చదవండి: రివ్యూ: 'ఎఫ్‌3' మూవీ ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.