ETV Bharat / entertainment

'నేనూ తమ్ముడు అందుకే సైలెంట్​గా ఉన్నాం - క్లారిటీ వచ్చే వరకు ఏదీ చెప్పం' - అనిరుధ్​ రవిచందర్​ లేటెస్ట్ ట్వీట్

Kalyan Ram Devil Movie : టావీవుడ్ స్టార్ హీరో నందమూరి కల్యాణ్​ రామ్ ప్రస్తుతం డెవిల్ సినిమా ప్రమోషన్స్​తో పాటు 'దేవర' మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన సినిమా ముచ్చట్లతో పాటు 'దేవర' గురించి కీలక అప్​డేట్​ ఇచ్చారు. ఇంతకీ అదేంటంటే ?

Kalyan Ram Devil Movie
Kalyan Ram Devil Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 8:47 PM IST

Kalyan Ram Devil Movie : నందమారి కల్యాణ్​ రామ్ ప్రస్తుతం తన సోదరుడి సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతూనే తన అప్​కమింగ్ మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'బింబిసార'తో మాసివ్ హిట్ అందుకున్న ఈ స్టార్​ హీరో ఇప్పుడు 'డెవిల్‌'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డిసెంబర్ 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం.

"నాకు ఈ కథ చాలా నచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నేను నటించలేదు. శ్రీకాంత్ నా దగ్గరకు స్టోరీ తీసుకురాగానే నేను కొన్ని మార్పులు చెప్పాను. ప్రత్యేకంగా ఎక్కడా ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. స్టోరీ కోసం డైలాగులు చెప్పే విధానాన్ని మాత్రమే మార్చుకున్నాను. దీని కోసం రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డాం. సినిమా చూసిన ఆడియెన్స్​కు ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఎంజాయ్‌ చేశామనే ఫీలింగ్​ వస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ గురించి చర్చలు జరిగాయి. సినిమా రిజల్ట్​ తర్వాత దాన్ని అఫీషియల్​గా అనౌన్స్​ చేస్తాం. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ అయితే రెడీగా ఉంది." అంటూ సినిమా గురించి తన అభిప్రాయం తెలియజేశారు.

మరోవైపు ఈ సినిమాలో కోసం 90 కాస్ట్యూమ్స్‌ ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు. పాత్రకు తగ్గట్లుగా అలా కాస్ట్యూమ్స్‌ మార్చడం అవసరమని అందుకే అన్ని ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు. అవన్నీ కూడా ఇక్కడివి కావని. ఫ్రాన్స్, ఇటలీ నుంచి మెటీరియల్‌ తెప్పించి మరీ కుట్టించారంటూ ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్​ విషయాలు వెల్లడించారు.

ఇక ఈ ఇంటర్వ్యూలోనే 'దేవర' సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్​డేట్​​ను తెలిపారు కల్యాణ్​ రామ్. "ఈ సినిమా షూటింగ్ 80 శాతం అయిపోయింది. అందరూ అప్‌డేట్‌ అడుగుతుంటే మాకు ఒత్తిడి కలుగుతుంది. ఏ విషయంలోనైనా మాకు ఒక క్లారిటీ వచ్చే వరకు స్పందించకూడదంటూ నేను, జూనియర్‌ ఎన్​టీఆర్​ అనుకుంటాం. అందుకే అన్నిటికీ ఎక్కువగా స్పందించం."

Devara Teaser Update : మరోవైపు దేవర మూవీకి మ్యూజిక్ అందిస్తున్న యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్​ ట్విట్టర్​ వేదకగా ఎన్​టీఆర్ ఫ్యాన్స్​కు ఓ గుడ్ న్యూస్​ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ త్వరలో రిలీజ్​ కానున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ నెట్టింట ఈ ట్వీట్​ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ఇంట్రెస్టింగ్​గా కల్యాణ్​ రామ్​ 'డెవిల్' గ్లింప్స్​.. 'గూఢ‌చారి అంటే ఇలానే ఉండాలా'

'దేవర' అప్​డేట్​పై కల్యాణ్​ రామ్​ కామెంట్స్​ - 'తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.