ETV Bharat / entertainment

కల్యాణ్​ రామ్ 'అమిగోస్'​ రివ్యూ.. ఎలా ఉందంటే? - అమిగోస్ సోషల్​మీడియా ట్విట్టర్​ రివ్యూ

నందమూరి హీరో కల్యాణ్​ రామ్​ నటించిన అమిగోస్​ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే?

Kalyan ram Amigos twitter review
కల్యాణ్​ రామ్ అమిగోస్​ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
author img

By

Published : Feb 10, 2023, 9:32 AM IST

బింబిసార లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అమిగోస్‌. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో అషికా రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జిబ్రాన్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. దీంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు భారీగానే తరలివచ్చారు. ఇప్పటికే పలు చోట్ల అమిగోస్‌ ఫస్ట్‌ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా బాగానే ఉందని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్​లో కనిపించారు. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్​గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో, మైఖేల్‌ అనే గ్యాంగ్ స్టర్‌గా మూడు సరికొత్త పాత్రల్లో అలరించారు కల్యాణ్​. అయితే ఈ ముగ్గురు ఒకరినొకరు ఎదురైన తర్వాత జరిగే సంఘటనలు ఆధారంగా సినిమా తెరకెక్కింది. అసలు ఈ ముగ్గురి మధ్య రక్త సంబంధం ఉందా..? లేక పోలికలు మాత్రమే కలిగి ఉన్నారా ? ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ పాత్ర అయిన మైఖేల్... తనలా ఉండే ఆ ఇద్దరు పాత్రలను ఎలా ఉపయోగించుకున్నాడు.. తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ.

ఇక సినిమాలోని నటీనటుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే.. పాజిటివ్- నెగెటివ్ పాత్రల్లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. మూడు పాత్రల్లో మూడు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నారు. ఇక ఈసినిమాకు హీరోయిన్ ఆషిక గ్లామర్ బాగా ప్లస్ అయ్యింది. ఆమె నటనకు కూడామంచి మార్కులు పడ్డాయి. దర్శకుడు కూడా కథను బాగానే హ్యాండిల్ చేశారట. జిబ్రాన్ మ్యూజిక్​ కూడా సినిమాకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్.. సినిమాలో బాగా వర్కౌట్ అయింది. స్క్రీన్ పై సాంగ్​ను బాగా విజ్యువలైజ్ చేశారు.

  • #Amigos A Subpar Drama/Thriller that had an interesting concept with substandard execution!

    The movie had a unique concept and a few moments/twists that were executed well. However, the overall narration is sluggish and does not excite for the most part.

    Rating: 2.25-2.5/5

    — Venky Reviews (@venkyreviews) February 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #Amigos 1st half review:
    ⭐️kalyan ram characterization.
    ⭐️3 characters builded nicely.

    👎🏼songs and bgm could have been better
    👎🏼 production values are not good by mythri for the first time because of camera work. Looks like outdated camera.
    Totally on 2ndhalf.#AmigosOnFeb10th pic.twitter.com/ReJ1ZzE1wy

    — ReviewMama (@ReviewMamago) February 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: అలా చేస్తేనే.. నాకు సంతృప్తి : పాప్​ కార్న్​ పిల్ల అవికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.