ETV Bharat / entertainment

Jawan 11th Day Collection : భారీ రేంజ్​ కలెక్షన్స్​తో వీకెండ్​లో 'జవాన్' జోరు.. రూ.800 కోట్లకుపైగా! - జవాన్ 11రోజుల్లో వరల్డ్ వైడ్ 800 కోట్లు కలెక్షన్స్

Jawan 11th Day Collection Worldwide Box Office : జవాన్ వీకెండ్​ కలెక్షన్స్​ భారీ రేంజ్​లో ఉన్నాయి. ఇప్పటివరకు 11 రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.840కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

Jawan 11th Day Collection : షారుక్ శివ తాండవం.. వీకెండ్​లో భారీ రేంజ్​ కలెక్షన్స్​.. రూ.800 కోట్లకుపైగా..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 9:41 AM IST

Jawan 11th Day Collection Worldwide Box Office : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్​ జోరు అస్సలు ఆగట్లేదు. ఈ చిత్రం మొదటి వారంలో రూ. 368.38 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది. 8వ రోజు రూ. 21.6 కోట్లు, 9వ రోజు రూ. 19.10 కోట్లు, 10వ రోజు రూ. 31.80 నెట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఆదివారం(సెప్టెంబర్​ 17) వీకెండ్​ కావడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్​గా రూ. 36.52 కోట్ల నెట్, రూ. 70 కోట్ల గ్రాస్​ వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఈ చిత్రం 11 రోజుల్లో కలిపి వరల్డ్ వైడ్​గా రూ.477.28 కోట్లు నెట్‌, రూ. 840 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్​ను అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వేగంగా రూ. 800 కోట్లు గ్రాస్ అందుకున్న ఏకైక హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది.

Jawaan Overseas Collections : ఇక షారుక్​ ఖాన్‌కు ఓవర్సీస్​లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. జవాన్ చిత్రం అక్కడ కూడా కళ్లు చెదిరే వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తూ ఖాతాలో వేసుకుంటుంది. 11 రోజుల్లో మొత్తంగా 34 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 282.52 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది.

ఇకపోతే ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. సినిమాలో ఇన్​వెస్టిగేషన్​ ఆఫీసర్​గా నయనతార, పవర్​ ఫుల్ విలన్ వెపన్ స్మగ్లర్​గా విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది. అనిరుథ్ రవిచందర్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Shah Rukh Khan Thalapathy Vijay : షారుక్​ - విజయ్​ కాంబోపై క్లారిటీ ఇచ్చేసిన అట్లీ.. రూ.1500 కోట్లు టార్గెట్​!

Rajinikanth Sharukh Khan : గత పదేళ్ల లెక్క తేల్చేశారు.. రూ.2500కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.