Jailer VS Vikram Collection : సూపర్ స్టార్ రజనీకాంత్-యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్.. ఈ రెండు పేర్లకు వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. నటనలో సరిహద్దులు చెరిపేశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎదురులేని స్టార్స్ కెరీర్లో రానిస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ లేక ముందే ఈ బడా స్టార్స్ ఇద్దరూ.. పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ ఇద్దరు హీరల సినిమాలు విడుదలవుతున్నాయంటే.. ప్రేక్షకులు, ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర బారులు తీస్తారు. ఎంతో మందికి కూడా ఈ స్టార్స్ ఇద్దరూ ఆదర్శంగా నిలిచారు. ఒకరేమో తన స్టైల్ అండ్ స్వాగ్తో ఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంటే.. మరొకరేమో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, పాత్రలతో మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ను దక్కించుకున్నారు.
Vikram All Time Box Office Collection : అయితే ఈ ఇద్దరు కొంత కాలంగా సరైన హిట్‌లేక సతమవుతున్న సమయంలో రీసెంట్గా విక్రమ్ చిత్రంతో వచ్చి పాన్ ఇండియా వైడ్లో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు కమల్‌హాసన్. దేశవ్యాప్తంగా రూ.400కోట్ల వరకు వసూళ్లను అందుకుని సెన్సేషన్ సృష్టించారు. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో భారీ చిత్రాలను లైన్లో పెట్టేశారు. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఇండియన్ 2, ప్రభాస్‌తో కల్కి, యాక్షన్ డైరెక్టర్ హెచ్ వినోద్‌తో ఓ సినిమా, మణిరత్నంతో మరో చిత్రాన్ని ఇలా వరుస సినిమాలను ప్రకటించి ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Jailer Worldwide Collections : ఇప్పుడు రజనీకాంత్ కూడా తాజాగా 'జైలర్' సినిమాతో వచ్చి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తూ దుకుకెళ్తోంది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ.400 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 416.25 కోట్ల వసూళ్లను అందుకుంది. దీంతో కమల్‌హాసన్ విక్రమ్ ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను రజనీ జైలర్ కేవలం ఆరు రోజుల్లోనే అధిగమించేసింది. విక్రమ్ చిత్రం టోటల్ థియేట్రికల్ రన్ టైమ్‌లో రూ.410 కోట్ల వసూళ్లను అందుకుంది. అయితే ఇప్పుడీ వసూళ్లను.. మంగళవారం నాటికి రజనీకాంత్ బ్రేక్ చేశారు. రూ. 416.25 కోట్ల కలెతక్షన్లను అందుకున్నారు. ఈ చిత్రం తెలుగులో ఆరు రోజుల్లో రూ. 28.60 కోట్ల షేర్, రూ.49కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఈ మూవీకి తెలుగులో 12 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసింది. అంటే నిర్మాతలకు ఇప్పటివరకు దాదాపు రూ. 15 కోట్లకు వరకు లాభాల్ని తెచ్చిపెట్టింది.
రోబో మూవీ తర్వాత రజనీకాంత్‌కు తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రజనీ ముత్తువేల్ పాండియన్ అనే జైలర్‌గా కనిపించారు. ఆయన క్యారెక్టరైజేషన్స్, యాక్షన్, కామెడీ టైమింగ్‌ను చాలా బాగుంది. ఇంకా ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీష్రాఫ్ గెస్ట్ రోల్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించి ఆకట్టుకున్నారు. తమన్నా, సునీల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
60ఏళ్ల వయసులోనూ నో రిలాక్స్.. యంగ్ హీరోలకు పోటీగా బాక్సాఫీస్ బద్దల్