ETV Bharat / entertainment

జగ్గూభాయ్​.. ఫస్ట్​ సల్మాన్​తో.. ఇప్పుడు ఆయన బావమరిదితో.. - సల్మాన్ బావమరిది సినిమాలో జగపతిబాబు

విలక్షణ నటుడు జగపతి బాబు మరో బాలీవుడ్​ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. సల్మాన్ ఖాన్​ బావమరిది ఆయష్​ శర్మ సినిమాలో నటించనున్నారు.

Jagapati babu ayush
జగ్గూభాయ్​.. ఫస్ట్​ సల్మాన్​తో.. ఇప్పుడు ఆయన బావమరిదితో..
author img

By

Published : Dec 9, 2022, 2:49 PM IST

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏదైనా సరే ఎమోషన్స్​తో దక్షిణాది ఆడియెన్స్​ను ఆకట్టుకున్న పవర్ ఫుల్ యాక్టర్ జగపతిబాబు. అయితే ఇప్పుడాయన బాలీవుడ్​లో నటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ 'కిసీ కా భాయ్​ కిసీ కా జాన్'​ చిత్రంలో నటిస్తున్న ఆయన.. ఇప్పుడు సల్మాన్ బావమరిది ఆయుష్​ శర్మతో కలిసి స్క్రీన్​ షేర్​ చేసుకోనున్నారు. ఆయుష్ నటించనున్న కొత్త సినిమా ఏఎస్​04లో ఓ కీలక పాత్ర పోషించనున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్​ సెట్​లోనూ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగ్గూ భాయ్​తో కలిసి దిగిన ఫొటోను ఆయుష్​ ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. జగ్గూపై ప్రశంసలు కురిపించారు. "నేను అన్ని భాషల సినిమాలను ఇష్టపడతాను. వాటిని చూస్తాను. అలానే జగపతి బాబు సర్ పనితనాన్ని ప్రశంసించకుండా ఉండలేను. ఫ్యాన్​ బాయ్ స్థాయి​ నుంచి ఫైనల్​గా మీతో స్క్రీన్ షేర్​ చేసుకుంటున్నాను. ఏఎస్​04 ఎంతో ఆసక్తిమైన చిత్రం. తప్పుకుండా మిమ్మల్ని ఎంటర్​టైన్ చేస్తుంది." అని పేర్కొన్నారు. కాగా, ఏఎస్​04 చిత్రాన్నిశ్రీ సత్య సాయి ఆర్ట్స్​ బ్యానర్​లో కేకే రాధామోహన్​ నిర్మిస్తున్నారు. కత్యాయన్ శివ్​పురి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: నా గడ్డం వల్లే రూ.150కోట్ల బడ్జెట్​ మూవీ ఫ్లాప్​.. చాలా ఫీలయ్యా: స్టార్ హీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.