ETV Bharat / entertainment

ఆస్కార్​ రేసు.. 'ఆర్ఆర్ఆర్‌'కు పోటీగా జాక్వెలిన్ మూవీ - ఆస్కార్​ అవార్డులు 2023

ఆస్కార్​ నామినేషన్స్​కు ఆర్​ఆర్​ఆర్​ 'నాటు నాటు' సాంగ్ ఎంపికవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విభాగంలో 'ఆర్​ఆర్​ఆర్'కు​ పోటీగా బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ నటించిన ఓ చిత్రం నిలిచింది. ఆ వివరాలు..

jacqueline-fernandez-song-nominated-oscars-2023-rrr
Etv jacqueline-fernandez-song-nominated-oscars-2023-rrr
author img

By

Published : Jan 25, 2023, 6:00 PM IST

ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. 95వ ఆస్కార్ నామినేషన్లను జనవరి 24న తేదీన ప్రకటించారు. మార్చి 13న ఈ అవార్డులను ఎంపికైన వారికి ప్రదానం చేయనున్నారు.

అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ 'నాటు నాటు'తో పాటు మరో ఐదు చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్'‍ చిత్రంలోని అప్లాజ్‌ అనే సాంగ్‌ ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్‌కు పోటీగా నిలిచింది. ఈ సందర్భంగా జాక్వెలిన్​ స్పందించారు.

"టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ టీమ్‌ను చూసి నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చప్పట్లతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన డయాన్, సోఫియా గురించి నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చేసిన అనుభవం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆస్కార్ నామినేషన్స్‌తో అనుబంధం కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైనది' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ నామినేట్ కావడం పట్ల జాక్వెలిన్ ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.