ETV Bharat / entertainment

విజయ్​-వెంకట్‌ ప్రభు కాంబో అఫీషియల్​.. రూ.200కోట్ల రెమ్యునరేషన్​.. నిజమెంత? - విజయ్ దళపతి రెమ్యునరేషన్​ 200కోట్లు

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌-దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబోలో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చింది. సినిమా కన్ఫామ్ అయింది. అయితే ఈ చిత్రం కోసం విజయ్​కు ఏకంగా రూ.200కోట్ల రెమ్యునరేషన్​ ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజమెంత?

Vijay Thalapathy Venkat Prabhu
విజయ్​ దళపతి-వెంకట్‌ ప్రభు కాంబో అఫీషియల్​
author img

By

Published : May 21, 2023, 5:12 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో 'లియో' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన.. రీసెంట్​గా 'కస్టడీ' మూవీతో డిజాస్టర్​ను అందుకున్న వెంకట్​ ప్రభుతో ఓ చిత్రం చేయనున్నారు. తాజాగా అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కూడా వచ్చేసింది. #thalapathy68 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రాన్ని ప్రకటించిన వెంకట్‌ ప్రభు.. 'విజయ్‌తో సినిమా చేయాలనే నా కల నిజమైంది' అంటూ సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్​పై కళపతి ఎస్‌. అఘోరం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఇటీవలే రెండు రోజుల క్రితం వచ్చిన ఓ వార్త ఇండియన్​ సినీ ఇండస్ట్రీలో హాట్​టాపిక్​గా మారింది. అదేంటంటే విజయ్ దళపతి రెమ్యునరేషన్​. 'లియో' తర్వాత చేయబోయే సినిమా కోసం విజయ్​కు.. ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్​ ఏకంగా రూ.200కోట్ల రెమ్యునరేషన్​ ఆఫర్​ చేసిందని తెగ వార్తలు వచ్చాయి. అంటే వెంకట్​ ప్రభుతో చేయబోయే సినిమాకేనా రూ.200కోట్లు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ రెమ్యునరేషన్​ వార్తపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్​లో విజయ్​ దళపతి పెద్ద స్టారే. అక్కడి మిగతా స్టార్ హీరోలు అజిత్​, రజనీకాంత్​, కమల్​హాసన్​లకు ఉన్న మార్కెట్​తో సమానంగా ఈయన మార్కెట్​ కూడా ఉంటుంది. ఈయన సినిమాలు కూడా భారీ వసూళ్లనే అందుకుంటుంటాయి. అయితే 2021 'మాస్టర్' సినిమా సమయంలో విజయ్ రెమ్యునరేషన్​ రూ.80కోట్లు అని వార్తలు వచ్చాయి. అయితే ఇంత తక్కువ సమయంలో విజయ్​ డబుల్​ ఫిగర్​ను ఎలా అందుకున్నారనే ప్రశ్న చాలా మంది మెదడలో మెదులుతోంది.

'మాస్టర్'​ తర్వాత ఆయన 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్'లాగా ఇండియా, వరల్డ్​ వైడ్​లో బిగ్గెస్ట్​ బ్లాక్​ బాస్టర్స్​ను కూడా అందుకోలేదు. 'బీస్ట్', 'వారిసు' అనే రెండు చిత్రాలు చేశారు. అవి రూ.100 నుంచి రూ.200కోట్ల వరకు వసూళ్లు సాధించి కమర్షియల్​ పరంగా హిట్​ అయినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. 'మాస్టర్​'కు ముందు వచ్చిన 'తేరి', 'భైరవ', 'మెర్సల్'​, 'సర్కార్​', 'బిగిల్'.. ఆ తర్వాత లేటెస్ట్​ 'వారసుడు' సినిమాల వరకు అన్నీ రెగ్యులర్ రొటీన్ ఎంటర్​టైన్మెంట్ కథలే. ఇవి కూడా వంద నుంచి రెండు వందల కోట్ల మధ్యలోనే వసూలు చేశాయి! మరి ఇలాంటి వసూళ్లతో ఆయనకు డబుల్ సెంచరీ రెమ్యునరేషన్​ ప్రచారం ఏంటనేది సస్పెన్సే​.

ఇదీ చూడండి: Bichagadu 2 Collections : జోరు మీదున్న 'బిచ్చగాడు 2'.. రెండో రోజు అదిరిపోయే వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.