ETV Bharat / entertainment

షారుక్​ చాలా కాస్ట్లీ.. పార్టీలో ఎంట్రీకీ భారీగా చెల్లించాల్సిందే.. అంతా రూ.కోట్లలోనే.. - షారుక్​ ఖాన్ ఫీజు

కింగ్​ ఆఫ్​ రొమాన్స్​.. బాలీవుడ్​ బాద్​షా.. ఇలా షారుక్​ ఖాన్​కు ఉన్న క్రేజే వేరు. విదేశాల్లో సైతం షారుక్​కు ప్రత్యేక ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. అందుకే షారుక్​ను 'వరల్డ్స్​ బిగ్గెస్ట్​ సూపర్​స్టార్'​ అని పిలుచుకుంటారు అభిమానులు. మరి అలాంటి బడా హీరో ఏదైనా ఓ పార్టీకి అతిథిగా వస్తే? ఆ ఫంక్షన్​లో స్టెప్పులు వేస్తే?.. ఇంక ఆ పార్టీ వేరే లెవల్​లో ఉంటుంది. కానీ షారుక్​ ఏమీ ఫ్రీగా పార్టీల్లోకి ఎంట్రీ ఇవ్వరు. ఆయనకు భారీ మొత్తం చెల్లించాల్సిందే. మరి పార్టీలకు షారుక్​ అడిగే రెమ్యూనరేషన్​ ఎంతో తెలుసా?

shahrukh khan
షారుక్
author img

By

Published : Jul 14, 2022, 11:39 AM IST

సీరియల్స్​లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్​ ప్రారంభించి బాలీవుడ్​ సూపర్​స్టార్​గా ఎదిగిన నటుడు షారుక్​ ఖాన్. తనదైన స్టైల్​లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు. షారుక్​ సినిమా రిలీజ్​ అంటే ఆ హడావుడి చెప్పనక్కర్లేదు. మరి ఇంత క్రేజ్​ ఉన్న హీరో అప్పుడప్పుడు పార్టీలకు కూడా హాజరై తన డ్యాన్సులతో, కామెడీ టైమింగ్​తో ఆ వేడుకకు వచ్చిన వారిని అలరిస్తుంటారని తెలుసా? అయితే ఆయనేమీ కేవలం ఆహ్వానిస్తే వచ్చి వాలిపోరు. అందుకు భారీ మొత్తం చెల్లించాల్సిందే. జస్ట్​ అలా కనిపించి వెళ్లిపోయేందుకే రూ.2 కోట్లకుపైగా సమర్పించుకోవాలి! మరి ఈ లెక్కన షారుక్​ పార్టీలో హడావుడి చేయాలంటే ఎంత చెల్లించాలో తెలుసా?

shahrukh khan
షారుక్​ ఖాన్

ఎంతైనా ఓకే.. షారుక్​ది చాలా బిజీ షెడ్యూల్. గ్యాప్​ లేకుండా వరుస షూటింగ్​లలో పాల్గొనే షారుక్​ దొరకడం కాస్త కష్టమే. అలాంటి సూపర్​స్టార్​ను ఎలాగైనా తమ వేడుకలకు హాజరయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు చాలామంది. అందుకు ఎంత చెల్లించేందుకు అయినా వెనుకాడరు. 2013లో ఓ దుబాయ్​ వేడుకే ఇందుకు ఉదాహరణ. మదీనత్​ జుమేరియా హోటల్​లో ఓ సంపన్నుల కుటుంబానికి చెందిన ఆ పెళ్లి వేడుకకు షారుక్​ను ఆహ్వానించారు. కేవలం 30 నిమిషాల షారుక్​ ప్రదర్శకుగాను ఆయనకు రూ.7.98 కోట్లను చెల్లించారు. ఇది అప్పట్లో సంచలనమైంది. ఇలా షారుక్​ తమ పార్టీకి వస్తే చాలని.. ఎంత చెల్లించడానికైనా రెడీ అని క్యూ కట్టిన వారు చాలా మందే ఉన్నారు. కానీ షారుక్​ అన్ని వేడుకలకు హాజరుకారు. బిజీ షెడ్యూల్​ కారణంగా కేవలం తనకు పరిచయస్థులు, స్నేహితుల వేడుకలకు మాత్రమే ఓకే చెప్తారట. 2012లో ఆయనకు 250 ఆహ్వానాలు అందితే అందులో కేవలం పది ఇన్విటేషన్లకే గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారుట షారుక్.

ఇదీ చూడండి: షారుక్​కు షాక్​.. దర్శకుడితో మనస్పర్థలు.. ఆగిపోయిన సినిమా షూటింగ్​!

అంబానీ పార్టీలో చిందులు
వ్యాపార దిగ్గజం, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ కుటుంబంతో షారుక్​కు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫంక్షన్​ జరిగినా షారుకే వాటికి హోస్ట్​గా వ్యవహిస్తారట. అంబానీ కుమార్తె ఇషా వివాహం అప్పుడు షారుక్​ ఆయన సతీమణి గౌరీ ఖాన్ వేడుకలో స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచారు. సుమారు రూ.700 కోట్లతో గ్రాండ్​గా జరిగిన ఆ పెళ్లిలో షారుక్​-గౌరీ దంపతులు రకరకాల పాటలకు స్టెప్పులు వేస్తూ వేడుకకు వచ్చిన అతిథులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో తెగ వైరలయ్యాయి. ఆ పార్టీలో షారుక్​తో పాటు బియాన్స్​ వంటి హాలీవుడ్​ స్టార్​ సింగర్​లు కూడా తమ ప్రదర్శనలతో ఆ​కట్టుకున్నారు.

shahrukh khan
ఇషా అంబానీ పెళ్లి వేడుకల్లో షారుక్
shahrukh khan
పెళ్లికి వచ్చిన అతిథులకు వడ్డిస్తున్న షారుక్

అయితే ఆ వేడుకల్లో షారుక్​ అతిథులకు వడ్డిస్తున్నట్లు ఉన్న ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఇది కూడా అంబానీ పేమెంట్​లో భాగమేనా అంటూ పలువురు ప్రశ్నించగా.. సజన్​ గోత్​ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు తరఫువారు ఇలా అతిథులకు మర్యాద చేస్తారంటూ కొందరు క్లారిటీ ఇచ్చారు. కానీ అంబానీ కుమార్తె పెళ్లి వేడుకలకు షారుక్​కు ఎంత చెల్లించారనే విషయం మాత్రం తెలియలేదు. గతనెల జూన్​లో ఆయన లేడీ సూపర్​స్టార్​ నయనతార పెళ్లి వేడుకలకు కూడా అతిథిగా హాజరయ్యారు. షారుక్​ పక్కా కమర్షియల్​ అనే ముద్ర పడటంతో నయన్​ పెళ్లికి కూడా పేమెంట్​ తీస్కోని ఉంటారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

shahrukh khan
నయనతార పెళ్లికి హాజరైన షారుక్

నాలుగేళ్లుగా సిల్వర్​స్క్రీన్​కు దూరంగా ఉన్న షారుక్​.. 2023లో ఒకేసారి మూడు చిత్రాలతో రానున్నారు. 'పఠాన్'​తో పాటు, 'జవాన్'​, 'డంకీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇటీవల విడుదలైన 'రాకెట్రీ' చిత్రంలో గెస్ట్​ రోల్​ పోషించిన షారుక్​.. 'లాల్​ సింగ్​ చద్ధా', 'బ్రహ్మాస్త్ర', 'టైగర్​ 3'లో సినిమాల్లో కూడా అతిథి పాత్రలో మెరవనున్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.