ETV Bharat / entertainment

'ఇక రీమేక్​లు చేయను.. హిందీ ప్రేక్షకులు నన్ను గట్టిగా తిట్టుకుంటున్నారు!' - హిట్​ 2 దర్శకుడ

'హిట్‌' సినిమాతో మెగాఫోన్‌ చేతపట్టిన దర్శకుడు శైలేష్​ కొలను. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇటీవల 'హిట్‌' ఫ్రాంచైజీలో భాగంగా రెండో కేస్‌తో 'హిట్‌ 2' చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శైలేష్‌ కొలను పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 30, 2022, 6:36 AM IST

Director Sailesh Kolanu Special Interview: ''ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 300కి పైగా నేరాల పూర్వపరాల్ని.. ఐదేళ్లపాటు క్షుణ్ణంగా పరిశీలించి రాసుకున్న కథలతోనే 'హిట్‌' ఫ్రాంచైజీ సినిమాల్ని రూపొందిస్తున్నా. అందుకే ఈ కథలు మిగతావాటికి భిన్నంగా ఉంటాయి'' అన్నారు దర్శకుడు శైలేష్‌ కొలను. 'హిట్‌' సినిమాతో మెగాఫోన్‌ చేతపట్టిన ఆయన, తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇటీవల 'హిట్‌' ఫ్రాంచైజీలో భాగంగా రెండో కేస్‌తో 'హిట్‌ 2' చిత్రాన్ని తెరకెక్కించారు. అడివి శేష్‌ కథానాయకుడిగా నటించారు. కథానాయకుడు నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శైలేష్‌ కొలను మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

ఇప్పుడంతా కథల్ని కొనసాగిస్తున్నారు. మీరు మాత్రం కొత్త కథ చెప్పారు. ఎందుకలా?
మొదట మేం కూడా అదే చేయాలనుకున్నాం. తొలి భాగంలో విష్వక్‌సేన్‌ చేసిన చేసిన రుద్రరాజు పాత్రని కొనసాగిస్తూ రాసుకున్న రెండో కథ కూడా ఉంది. కానీ కరోనా తర్వాత మేం నిర్ణయం మార్చుకున్నాం. ప్రేక్షకులు ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పైగా 'ఎవెంజర్స్‌' తరహాలో 'హిట్‌' యూనివర్స్‌ని సృష్టించాలనుకున్నాం. అందుకే మరో కొత్త ఆఫీసర్‌ని రంగంలోకి దించాం. అలా ప్రతి సినిమాతోనూ ఒకొక్క ఆఫీసర్‌ని పరిచయం చేస్తూ.. చివర్లో అందరినీ కలపాలనేదే మా ప్రయత్నం.

నేర నేపథ్యంలో కథలు తరచూ వస్తున్నాయి కదా. వాటికి భిన్నంగా ఉండేలా మీరెలాంటి కసరత్తులు చేస్తున్నారు?కథలపై నేను చేసిన పరిశోధన ప్రత్యేకం. సిడ్నీలో నేను పనిచేసిన విశ్వ విద్యాలయం గ్రంథాలయంలో కూర్చుని ఐదేళ్లపాటు నేరాలపై పరిశోధన చేశా. ఫోరెన్సిక్‌, క్రిమినాలజీ తదితర విషయాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. అందుకు తగ్గట్టే నా సినిమాలు ఉంటాయి.

ఈ కథకు శేష్‌నే ఎంచుకోవాలని ముందే నిర్ణయించుకున్నారా?
కథని, పాత్రల్ని బట్టే నటుల్ని ఎంచుకోవాలనుకుంటా. 'హిట్‌ 2' పతాక సన్నివేశాల్ని రాస్తున్నప్పుడు నాకు కేడీ పాత్రలో అడివి శేష్‌ కనిపించారు. ఆయనతో పాటు, మరో ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా మనసులో ఉన్నారు. నానికి అడివి శేష్‌ పేరు చెప్పాక... వెళ్లి అడుగు అన్నారు. థ్రిల్లర్‌ కథలు శేష్‌ చాలా చేశారు. కానీ ఈ కథలో కాస్త వెటకారం కూడా ఉంటుంది. అందులో తననైతే కొత్తగా చూపించొచ్చనిపించింది. వెళ్లి కథ చెప్పగానే తను చేయడానికి అంగీకారం తెలిపారు.

'హిట్‌' కోసం ఓ సీజన్‌ని సృష్టించమని దర్శకుడు రాజమౌళి సలహా ఇచ్చారు కదా..!
అది చాలా మంచి ఆలోచన. నాని కూడా అదే అన్నారు. అలా చేయాలంటే నేను 'హిట్‌' సినిమాలు తప్ప మరొకటి చేయకూడదు.

హిందీలో 'హిట్‌' తొలి భాగాన్ని రీమేక్‌ చేశారు కదా, అలా ఈ సినిమా చేస్తారా?
ఇక రీమేక్‌ కథలు చేయను. ఒకవేళ హిందీలో హిట్‌ కథల్నే చేయాలనుకుంటే, మరో కొత్త కథని తీస్తా. అక్కడ ఓటీటీల్లో ముందే చూసేస్తున్నారు. పైగా రీమేక్‌ చేస్తే అక్కడ ప్రేక్షకులు తిడుతున్నారు. 'దక్షిణాదిలో ఎవరో ఓ మంచి కథ రాసి చేస్తే, దాన్ని ఇక్కడ రీమేక్‌ చేస్తున్నాడు చూడు' అంటున్నారు. అక్కడ తీసింది కూడా నేనే అని చెప్పుకోవల్సి వచ్చింది (నవ్వుతూ).

తదుపరి మీరు చేయబోయే సినిమా హిట్‌ ఫ్రాంచైజీలో భాగంగానే ఉంటుందా?వేరే కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సంభాషణలతో సహా మూడు కథల్ని రాసుకున్నా. రాజమౌళి సర్‌ చెప్పినట్టుగా చేద్దామని నాని అంటే... నేను ఈ ఫ్రాంచైజీతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 2న సినిమా విడుదలయ్యాక మా నిర్ణయంపై స్పష్టత వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.