ETV Bharat / entertainment

సౌత్​లో రికార్డు సృష్టించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదంటే? - most viewed bollywood movie in south

Highest Collected Bollywood Movie In South: బాలీవుడ్ సినిమాల్ని సౌత్​ ఆడియెన్స్​ పెద్ద‌గా ఆద‌రించ‌రు. కార‌ణాలేవైనా ఈ మైండ్​సెట్​ని మనం ఇప్పటికీ చాలామందిలో గమనిస్తుంటాం. అయితే ఈ మ‌ధ్య వ‌చ్చిన ఓ హిందీ సినిమా దక్షిణాదిలో దాదాపు రూ.200 కోట్లు క‌లెక్ష‌న్స్​ను రాబ‌ట్టింది. ఇంత‌కీ ఆ సినిమా ఏంటంటే..

Highest Collected Bollywood Movie In South

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 5:11 PM IST

Highest Collected Bollywood Movie In South : దక్షిణాది ప్ర‌జ‌లకు సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే రాష్ట్రానికొక ఇండ‌స్ట్రీ ఉంది. అన్ని సినిమాలు చూస్తారు. కానీ బీటౌన్ సినిమాల్ని పెద్ద‌గా ఆద‌రించ‌రు. మ‌న మూవీస్​ని వాళ్లు త‌క్కువ అంచ‌నా వేయ‌డం, న‌టుల్ని చిన్న చూపు చూడ‌టం లాంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. దీనికి తోడు గ‌తంలో లాగా బీ టౌన్ నుంచి మంచి చిత్రాలు రావ‌డం త‌గ్గింది. అందుకే మ‌న వాళ్లు వాటిని పట్టించుకోవ‌ట్లేదు. కానీ ఇటీవ‌ల వ‌చ్చిన ఒక బాలీవుడ్ సినిమాను సూప‌ర్​ హిట్ చేశారు దక్షిణాది ప్రేక్షకులు.

రెండు ఇండస్ట్రీల మధ్య..
బాలీవుడ్ కింగ్​ షారుక్​ ఖాన్ హీరోగా వ‌చ్చిన 'జ‌వాన్​' సినిమా సౌత్​లో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. త‌మిళ యంగ్​ డైరెక్ట‌ర్​ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సెప్టెంబర్​ 7న విడుదలై బాక్సాఫీస్​ వద్ద అద్భుతమైన విజయం న‌మోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1069.85 కోట్లు, మన దేశంలో రూ.640.42 కోట్ల వ‌సూళ్లను కొల్లగొట్టింది. ఇంకా కొన్ని థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతూ జైత్ర యాత్ర కొన‌సాగిస్తోంది. ఇందులో విజయ్​ సేతుపతి, నయనతార వంటి అగ్ర నటీనటులూ నటించారు. ఇక హిందీ చిత్రానికి ఈ మేర కలెక్షన్స్​ను తెచ్చిపెట్టిన సౌత్​ ఆడియెన్స్​ రెండు ఇండస్ట్రీల మధ్యనున్న అంతరాన్ని తగ్గించందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మూడో బాలీవుడ్​ చిత్రంగా..
ఈ చిత్రం అటు బాలీవుడ్​లోనే కాకుండా.. ఇటు సౌత్​లోనూ మంచి టాక్​ను సొంతం చేసుకుంది. దీంతో సూపర్​ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. త‌మిళ సూప‌ర్​ స్టార్ ర‌జ‌నీకాంత్‌, విజ‌య్​ సినిమాల లాగే మంచి హైప్ క్రియేట్ చేసి ప్రజాద‌ర‌ణ పొందడంలో స‌క్సెస్ సాధించింది షారుక్​​ 'జవాన్​'. 'బాహుబలి- 2', 'కేజీఎఫ్​- 2', 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాల త‌ర్వాత రూ.వెయ్యి కోట్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు ద‌క్కించుకుంది. మొత్తంగా 'దంగల్​', 'పఠాన్​' తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బాలీవుడ్ చిత్రంగా 'జవాన్​' నిలిచింది.

తొలి బాలీవుడ్​ నటుడిగా..
'జ‌వాన్​' గురించి ముఖ్యంగా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రం దక్షిణాదిలో రూ.200 కోట్లు వ‌సూలు చేసింది. దక్షిణ భారత సినీ రంగంలో ఈ ఘ‌నత సాధించిన తొలి బాలీవుడ్​ న‌టుడిగా షారుక్​​ రికార్డు సృష్టించాడు. ఇదే స‌మ‌యంలో మ‌న ద‌క్షిణాది న‌టులైన ర‌జ‌నీ, క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ లాంటి నటులు కూడా హిందీలో ఈ రేంజ్​ క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం క‌ష్టమ‌ని భావిస్తారు. ఇక థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత 'జవాన్​' ఇప్పుడు ఓటీటీ ప్లాట్​ఫామ్​లో అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్​లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'డీజే టిల్లు' రాధిక హాట్ ఫోజులు​​​- కిల్లింగ్ ఎక్స్​ప్రెషన్స్​తో నేహా శెట్టి గ్లామర్​ షో

నెటిజన్​కు షారుక్​ ఖాన్​ దిమ్మతిరిగే కౌంటర్​- మందులు పంపిస్తా తగ్గుతుందంటూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.