ETV Bharat / entertainment

బాలీవుడ్​ హిట్​ సాంగ్​కు స్టెప్పులతో అదరగొట్టిన చరణ్​-అక్షయ్​.. వీడియో చూశారా? - అక్షయ్​కుమార్​ డ్యాన్స్​

హీరోలు రామ్​చరణ్​, అక్షయ్​కుమార్​.. ఓ బాలీవుడ్​ హిట్​ సాంగ్​కు స్టెప్పులేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. మీరూ ఆ వీడియోను చూసేయండి.

heros ramcharan and akshaykumar dance tu cheez badi hai song

author img

By

Published : Nov 13, 2022, 4:05 PM IST

Ramcharan Akshay Kumar Dance: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఆయన తనయుడు రామ్​చరణ్​ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తన నటనతో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​లో కొమురంభీం పాత్రలో తన నటనకు విమర్శకులు సైతం ప్రశంసించారు. అయితే ఇటీవలే చరణ్​.. దిల్లీలోని ఓ ప్రైవేట్​ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే ఈవెంట్​కు బాలీవుడ్​ స్టార్​ నటుడు అక్షయ్​కుమార్​ కూడా వచ్చారు. వీరు కలిసి దిగిన ఫొటోలు నెట్టింట హల్​చల్ చేస్తున్నాయి. దానితో పాటు స్టేజ్ మీద ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్​గా మారింది.

బాలీవుడ్ సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'తూ చీజ్ బ‌డీ హై మ‌స్త్ మ‌స్త్' అనే పాట‌కు స్టేజ్​ మీద రామ్​చరణ్ స్టెప్పులేశారు. ఆయన స్టెప్పులు చూసి అక్షయ్ కుమార్ సైతం కాలు కదిపారు. అలాగే చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మా.. మంగమ్మా..' పాటకు కూడా అక్షయ్.. చరణ్​తో కలసి స్టెప్పులేశారు. వీరి డాన్స్ అక్కడ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్​గా మారాయి.

'ఆర్​ఆర్​ఆర్​' సినిమా భారీ హిట్ అవ్వడంతో రామ్​చరణ్​కు క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాతో చరణ్ కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి చేసింది మూవీ టీమ్. ఇక తర్వాత షెడ్యూల్ త్వరలో న్యూజిలాండ్​లో ప్రారంభం అవ్వనుంది. ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా మరో పాత్రలో ఎన్నికల అధికారిగా చెర్రీ కనిపిస్తారని టాక్​.

ఇవీ చదవండి:

'సంక్రాంతికి ఆ సినిమాలకే ప్రాధాన్యం'.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం

'RRR-2'పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న.. త్వరలోనే గుడ్ న్యూస్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.