ETV Bharat / entertainment

నయన్​ షాకింగ్ నిర్ణయం.. టెన్షన్​లో ఫ్యాన్స్​.. నిజమేనా? - nayantara upcoming films

దక్షిణాది స్టార్​ హీరోయిన్ నయనతార గురించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. అదేంటంటే.

Nayantara Goodbye to movies
నయనతార రిటైర్మెంట్​
author img

By

Published : Sep 3, 2022, 10:05 AM IST

కొందరు కథానాయికలు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి, ఓ మైలు రాయిని చేరుకుంటారు. ఈ జాబితాలో నిలిచిన అతి తక్కువ మందిలో లేడీ సూపర్​ స్టార్​ నయనతార ఒకరు. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​గా మెరుపులు మెరిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మాలీవుడ్‌ టూ టాలీవుడ్‌ వయా కోలీవుడ్‌ అంటూ తన నట జీవితాన్ని అందమైన ప్రయాణంగా మార్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె బాలీవుడ్​ అరంగేట్రం చేయనున్నారు. గ్లామరస్‌ పాత్రలతో కెరీర్​ను ప్రారంభించి పెర్ఫార్మెన్స్‌ పాత్రల వరకు శభాష్‌ అని ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్న ఈ తార ఇప్పుడు షాకింగ్​ వార్త తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసే వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నయనతార సినిమాల్లో సంపాదించినదంతా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం భర్త విఘ్నేష్‌ శివన్‌తో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న ఈ అమ్మడు త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతుందన్నదే వార్త జోరందుకుంది. ఇది ఆమె అభిమానులను కలతకు గురి చేస్తోంది.

నయన్​.. నటనకు స్వస్తి చెప్పి తన ఇతర వ్యాపారాల వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే నటనకు గుడ్‌బై చెప్పినా నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే నయన్​ లేదా విఘ్నేష్‌ శివన్‌ స్పందించే వరకు వేచి ఉండాల్సిందే. వాళ్లు ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా నయన్​.. 'మానస్సినక్కరే' అనే మలయాళ సినిమాతో 2003లో తెరంగేట్రం చేశారు. 'చంద్రముఖి', 'వల్లభ' తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె 'లక్ష్మీ'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'బాస్‌', 'యోగి', 'దుబాయ్‌ శీను', 'తులసి', 'బిల్లా', 'అదుర్స్‌', 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'గ్రీకు వీరుడు' తదితర సినిమాల్లోని విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ఓవైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూ మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ లేడీ సూపర్‌ స్టార్‌గా మారారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'గాడ్‌ ఫాదర్' , షారుఖ్‌ఖాన్‌ సరసన 'జవాన్‌'తోపాటు కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. నయన్‌ 75వ చిత్రాన్ని నీలేశ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు.

ఇదీ చూడండి: అభిమానులకు ఎన్టీఆర్‌ క్షమాపణలు.. అందుకే ఈవెంట్‌ రద్దైందన్న రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.