ETV Bharat / entertainment

రాజమౌళి-మహేశ్ సినిమాలో విలన్​గా కోలీవుడ్ స్టార్ హీరో! - మహేశ్ రాజమౌళి సినిమా న్యూస్​

రాజమౌళి-మహేశ్ సినిమాలో విలన్​గా కోలీవుడ్ స్టార్ హీరో నటింనున్నారని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే.

Karthi as villan in Mahesh Rajamouli movie
రాజమౌళి-మహేశ్ సినిమాలో విలన్​గా కోలీవుడ్ స్టార్ హీరో
author img

By

Published : Oct 13, 2022, 5:16 PM IST

కొన్ని కాంబినేషన్లు చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో మహేశ్‌బాబు - రాజమౌళి ప్రాజెక్టు ఒకటి. ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా... రాజమౌళి 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను జక్కన్న మొదలుపెట్టారు. మరోవైపు మహేశ్‌బాబు కూడా త్రివిక్రమ్‌ సినిమాను పట్టాలెక్కించారు. ఆ సినిమా పూర్తవ్వగానే... రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేశ్‌.

అయితే ఈ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విలన్​ కోసం ఓ కోలీవుడ్​ స్టార్​ హీరోను లైన్​లో పెట్టాలని రాజమౌళి ఆలోచిస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన కథానాయకుడు కార్తిని సంప్రదించారని ఆయన పాత్ర గురించి చెప్పారని తెలిసింది. పాత్ర నచ్చడంలో కార్తి కూడా ఒకే చెప్పడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరోలనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ విషయం బయటకు రావడం వల్ల రాజమౌళి, మహేశ్​ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్​ అవుతున్నారు.

కాగా, ఇటీవలే రాజమౌళి మహేశ్​ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఇదీ చూడండి: ఆ సినిమా ఫ్లాప్​.. రెమ్యునరేషన్​ తిరిగిచ్చేసిన చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.