Bimbisara Movie Balakrishna: జయాపజయాలను పట్టించుకోకుండా కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్తున్నారు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఈ క్రమంలోనే ఇటీవల 'బింబిసార'గా ప్రేక్షకుల్ని పలకరించారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం.. గత శుక్రవారం(ఆగస్టు 5) విడుదలై హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ.. బింబిసార చిత్రాన్ని శనివారం థియేటర్లో వీక్షించారు. హీరో కల్యాణ్‌రామ్, దర్శకుడు వశిష్ఠ తదితరులతో కలిసి ఆయన సినిమా చూశారు. అనంతరం బింబిసార చిత్రబృందాన్ని అభినందించారు. అద్భుతమైన ప్రయత్నమంటూ ప్రశంసించారు.
![hero balakrishna watched bimbisara movie in theatre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16094350_eoeoe.jpg)
![hero balakrishna watched bimbisara movie in theatre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16094350_wpeoepee.jpg)
![hero balakrishna watched bimbisara movie in theatre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16094350_ekieoee.jpg)
ఇక బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ బాణీలు అందిస్తున్నారు. మరోవైపు, బాలకృష్ణ నటించనున్న 108వ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం గురించి తాజాగా తొలి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ సినిమాను అధికారికంగా ప్రకటించారు
ఇవీ చదవండి: ప్రభాస్ సలార్ అప్డేట్ మరో రెండు రోజుల్లో