ETV Bharat / entertainment

'ఆ పాత్ర చేయండి ప్లీజ్​.. రూ.2355కోట్లు ఇస్తాం'​.. జానీడెప్​కు డిస్నీ జాక్​పాట్? - పైరేట్స్​ ఆఫ్​ ది కరీబియన్

మాజీ భార్య అంబర్​హెర్డ్​ చేసిన ఆరోపణల కారణంగా ఎన్నో విమర్శలతో పాటు చేతిలోని సినిమా అవకాశాలను కోల్పోయారు హాలీవుడ్ స్టార్ జానీ డెప్. 'పైరేట్స్​ ఆఫ్​ ది కరీబియన్'​తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నటుడిని.. ఆ ఫ్రాంఛైజీ నుంచే తొలగించింది నిర్మాణ సంస్థ డిస్నీ. కానీ, డెప్​ ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవలే తేలిన నేపథ్యంలో తిరిగి అతడిని కెప్టెన్​ జాక్​స్పారోగా నటింపజేసేందుకు రూ.2355కోట్లను డిస్నీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Johnny Depp
pirates of the caribbean
author img

By

Published : Jun 27, 2022, 1:20 PM IST

మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్​పై పరువు నష్టం కేసుతో ఇటీవలే వార్తల్లో నిలిచిన హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్​కు జాక్​పాట్​ తగిలింది! ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ అతడికి రూ.2355కోట్లు (301 మిలియన్ డాలర్లు) ఆఫర్​ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్​హిట్​ ఫ్రాంఛైజీగా నిలిచిన 'పైరేట్స్​ ఆఫ్​ ది కరీబియన్​' సిరీస్​లో తిరిగి కెప్టెన్​ జాక్​ స్పారోగా అతడిని నటింపజేసేందుకు ఈ భారీ మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం.

Johnny Depp
అంబర్​హెర్డ్​-జానీ డెప్

అయితే ఈ ఆఫర్​ను జానీ అంగీకరిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 2018లో తాను కూడా గృహ హింస బాధితురాలినే అంటూ అంబర్​హెర్డ్..​ వాషింగ్టన్​పోస్ట్​లో ఓ వ్యాసం రాసింది. దీంతో డెప్​పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలను రద్దు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిస్నీ కూడా 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' ఫ్రాంఛైజీ నుంచి అతడిని తొలగించింది.

johnny depp vs amber heard
అంబర్​హెర్డ్

అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కోర్టుకెక్కారు జానీడెప్. అంబర్​హెర్డ్​పై 50 మిలియన్ల పరువు నష్టం కేసు వేసి గెలిచారు. దీంతో డెప్​తో తిరిగి సంబంధాలను ఏర్పరచుకునేందుకు డిస్నీ అమితాసక్తి చూపిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అందుకోసం ఎంత మొత్తం చెల్లించేందుకైనా సిద్ధంగా ఉందని ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్​సైట్ పేర్కొంది.

pirates of the caribbean
'పైరేట్స్​ ఆఫ్​ ది కరీబియన్'​

ఇప్పటికే డెప్​కు క్షమాపణ లేఖ సహా 301 మిలియన్ డాలర్ల ఆఫర్​ను డిస్నీ పంపినట్లు సదరు సంస్థ తెలిపింది. 'పైరేట్స్​ ఆఫ్​ ది కరీబియన్ 6'తో పాటు జాక్​స్పారో తొలి దశ జీవితంపై ఓ డిస్నీ ప్లస్ సిరీస్​ కోసం డెప్​కు ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. అయితే ఈ సమాచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇదీ చూడండి: జానీ డెప్​-అంబర్​ హెర్డ్​.. ప్రేమ కథ నుంచి కోర్టు దాకా.. వయా ఎలాన్ మస్క్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.