ETV Bharat / entertainment

మూడోరోజూ 'హనుమాన్' సునామీ- బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం- మొత్తం ఎన్ని కోట్లంటే? - Hanuman Overseas collections

Hanuman Movie Day 3 collection: విజువల్ వండర్ హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రెండో రోజు కంటే ఆదివారం ఎక్కువ కలెక్షన్ సాధించింది. మరి హనుమాన్ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Hanuman Collections
Hanuman Collections
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 9:47 AM IST

Updated : Jan 15, 2024, 10:22 AM IST

Hanuman Movie Day 3 collection: సూపర్ హీరో సినిమా హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రీలీజ్​ నుంచే హౌస్​ఫుల్ షోస్​తో రన్ అవుతున్న ఈ మూవీ మూడోరోజు కూడా అదే జోరు ప్రదర్శించింది. తొలి రెండు రోజుల కంటే ఆదివారం (జనవరి 14) ఎక్కువ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా మూడోరోజు రూ.15.50 కోట్ల కలెక్షన్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం రూ.40.15 కోట్లు వసూళ్లు సాధించిందని ఇన్​సైట్ టాక్. దీంతో విడుదలైన మూడు రోజుల్లోనే హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంది.

దేశవ్యాప్తంగా రోజువారి వసూళ్లు

  • తొలి రోజు- రూ.12.20 కోట్లు
  • రెండో రోజు- రూ.12.45 కోట్లు
  • మూడో రోజు- రూ.15.50 కోట్లు

Hanuman Movie Occupancy:ఆదివారం తెలుగులో హనుమాన్ ఆక్యుపెన్సీ 83.69 శాతంగా నమోదైంది. అత్యధికంగా వరంగల్ 95 శాతం, హైదరాబాద్​ 92 శాతంలో నమోదైంది. అటు హిందీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడోరోజు హిందీలో 31.90 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Hanuman Overseas: ఓవర్సీస్​లోనూ హనుమాన్ దూసుకుపోతోంది. ఇప్పటికే 2+ మిలియన్ డాలర్లు వసూల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ తెలిపింది. ఈ క్రమంలో యూఎస్​ఏలో 2+ మిలియన్ డాలర్ల క్లబ్​లో చేరిన 13వ తెలుగు హీరోగా తేజ సజ్జ రికార్డు కొట్టారు.

ఎప్పటికీ ధర్మమే గెలుస్తుంది: తమ టీమ్ పట్ల, సినిమా గురించి కొందరు నెగిటివ్​గా ప్రచారం చేశారని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. 'కొందరు ఫేక్ ప్రొఫైల్స్​తో సోషల్ మీడియాలో మాపై నెగిటివ్ క్రియేట్ చేశారు. ఆ డిజిటల్​ చెత్తను నిన్నటి భోగి మంటల్లో పడేయడం మర్చిపోయారనుకుంటా. మాపై నమ్మకముంచి మాకు మద్దతుగా నిలబడిన ఆడియెన్స్​కు థాంక్స్. ధర్మం వైపు నిలబడేవారు ఎల్లప్పుడూ గెలుస్తారు. ఇది మరోసారి రుజువైంది. తనపై వచ్చిన నెగిటివిటీని కిందకు తొక్కుతూ, ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం ఆకాశంలో ఎత్తులో ఎగరడానికి సిద్ధంగా ఉంది' అని ప్రశాంత్ ట్వీట్ చేశారు.

  • I've encountered a significant amount of propaganda surrounding our team, along with the proliferation of fake profiles across social media. It seems like some of this digital debris has been forgotten to be thrown in yesterday's Bhogi fire.

    However, I express my sincere…

    — Prasanth Varma (@PrasanthVarma) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'హనుమాన్'​ కలెక్షన్స్​ - రెండో రోజు భారీగా జంప్​ - ఏకంగా ఎన్ని కోట్లంటే?

3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్- లాభాల్లోకి హనుమాన్!- 2024లో తొలి బ్లాక్​బస్టర్

Last Updated : Jan 15, 2024, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.