ETV Bharat / entertainment

మహేశ్​ గత 5 చిత్రాల వసూళ్లు - 'గుంటూరు కారం' బ్రేక్ చేస్తుందా? - మహేశ్ బాబు గుంటూరు కారం

Guntur Kaaram Mahesh Babu Last 5 Movies Collections : సూపర్​ స్టార్ మహేశ్​ బాబు గుంటూరు కారం విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా మహేశ్​ బాబు నటించిన గత ఐదు సినిమాల తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 10:12 AM IST

Guntur Kaaram Mahesh Babu Last 5 Movies Collections : మరో రోజులో సూపర్​ స్టార్ మహేశ్​ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ 'గుంటూరు కారం' విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మహేశ్​ బాబు నటించిన గత ఐదు సినిమాల తొలి రోజు కలెక్షన్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివరాల్లోకి వెళితే - స్పైడర్ చిత్రం రూ.16 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత భరత్ అనే నేను రూ. 23.5 కోట్లు కలెక్ట్ చేసింది. మహర్షి రూ. 24.68 కోట్లు, సరిలేరు నీకెవ్వరూ రూ.32.77 కోట్లు, సర్కారు వారి పాట రూ. 36 కోట్లు వసూళ్లను సాధించింది.

IMDB ప్రకారం వరల్డ్ వైడ్​గా కలెక్షన్​ వివరాల్లోకి వెళితే - స్పైడర్ చిత్రం తొలి రోజు రూ. 41.5 కోట్లు వసూళ్లను సాధించింది. భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 53.8 కోట్లను అందుకుంది. మహర్షి చిత్రం రూ.48.2 కోట్లు, సరిలేరు నీకెవ్వరూ రూ.64.7 కోట్లు, 53 కోట్ల గ్రాస్, ఇక సర్కారు వారి పాట రూ. 75.5 కోట్లు కలెక్ట్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక తాజాగా జనవరి 12 రిలీజ్​ కానున్న 'గుంటూరు కారం' సినిమా విషయానికి వస్తే - అడ్వాన్స్ బుకింగ్స్​ ఇక్కడితో పాటు ఓవర్సీస్​లో రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.65 కోట్లకుపైగా నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే ఈ గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​ విషయానికి వస్తే - వరల్డ్​వైడ్​గా రూ.134.6 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలిసింది. అంటే గుంటూరు కారం బ్రేక్ ఈవెన్​కు చేరుకోవాలంటే రూ.135 కోట్ల షేర్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై పెరిగిన బజ్, మహేశ్​బాబు ఇమేజ్ కారణంగా ఓపెనింగ్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, ఈ టార్గెట్ బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో.

కళ్లు చెదిరే రేంజ్​లో 'గుంటూరు కారం' బిజినెస్ - ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ టార్గెట్ ఇదే!

ఇంట్రెస్టింగ్​గా పొంగల్​ ఫైట్- హీరోల మధ్యే కాదు పోటీలో డైరెక్టర్లు కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.