ETV Bharat / entertainment

బాలయ్య టైటిల్ పెట్టారు.. సినిమా దూసుకెళ్లడం పక్కా!: గోపీచంద్​ - గోపీచంద్​ రామబాణం సినిమా

"లక్ష్యం, లౌక్యంలాగే మంచి వినోదం, కుటుంబ భావోద్వేగాలు నిండి ఉన్న చిత్రం రామబాణం. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా" అన్నారు గోపీచంద్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీవాస్‌ తెరకెక్కించారు. ఈ సినిమా మే 5న విడుదల కానున్న నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.

Gopichand Ramabanam Movie
Gopichand Ramabanam Movie
author img

By

Published : May 1, 2023, 6:44 AM IST

Gopichand Ramabanam Movie : గోపీచంద్‌ హీరోగా దర్శకుడు శ్రీవాస్‌ తెరకెక్కించిన మూడో చిత్రం రామబాణం. మే 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ వేడుకను ఉద్దేశించి హీరో గోపీచంద్‌ మాట్లాడారు. తన సినిమాకు టైటిల్‌ పెట్టిన నందమూరి బాలకృష్ణకు ఆయన మరోసారి థ్యాంక్స్‌ చెప్పారు.

"భూపతిరాజా రాసిన మంచి కథతో ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు శ్రీవాస్‌ గతంలో నాతో తీసిన 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాల్లానే ఇందులోనూ వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ సినిమాకు టైటిల్‌ పెట్టిన నందమూరి బాలకృష్ణగారికి మరోసారి థ్యాంక్స్‌. ఆయన ఈ పేరు చెప్పినప్పటి నుంచి ఈ సినిమా అన్ని విషయాల్లో పాజిటివ్‌ వైబ్స్‌తో దూసుకెళ్తోంది. ఫలితం కూడా అలానే ఉంటుందని ఆశిస్తున్నా. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా అనేది సమష్టి కృషి. కథానాయిక డింపుల్‌కు ఇది రెండో చిత్రం. ఆమె మరిన్ని మంచి సినిమాలు చేసి, కెరీర్‌లో ఎదగాలని కోరుకుంటున్నా. జగపతిబాబుగారితో నటిస్తుంటే నా సోదరుడితో మాట్లాడినట్టే ఉంటుంది. మా కాంబినేషన్‌ సీన్లు బాగా వచ్చాయి. అలీతో కలిసి నేను నటించిన సన్నివేశాలు కబుపుబ్బా నవ్విస్తాయి'' అని గోపీచంద్​ తెలిపారు.

''సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ పాటలకు నేను డ్యాన్స్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. జగపతిబాబు, ఖుష్బూ, అలీ.. ఇలా సీనియర్‌ నటులతో కలిసి నటించడం గొప్ప అనుభూతి. హీరోయిన్‌గా నా తొలి సినిమా 'ఖిలాడి' విడుదలకు ముందే 'రామబాణం' చిత్రానికి సంబంధించిన చర్చలు జరిగాయి. భైరవి పాత్రకు నేను సరిపోతానా, లేదా? అని స్క్రీన్‌ టెస్ట్‌ చేసి నన్ను ఎంపిక చేశారు. ఆ క్యారెక్టర్‌కు తగ్గట్టు దర్శకుడు నన్ను మార్చారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల చాలా మంచి వ్యక్తులు'' అని డింపుల్‌ హయాతి పేర్కొన్నారు.

Gopichand Ramabanam Movie
.

''భూపతి ఈ కథ చెప్పినప్పుడే దీన్ని ఏ స్కేల్‌లో చేస్తే బాగుంటుందని ఆలోచించాం. అది బాగా వస్తున్న కొద్దీ మా నమ్మకం రెట్టింపయ్యింది. బలమైన భావోద్వేగాలు, మంచి వినోదం, చక్కటి యాక్షన్‌.. ఇలా అన్ని కమర్షియల్‌ కొలతలతో చేసిన చిత్రమిది. ఫస్ట్‌కాపీ చూసుకున్నాం. మంచి అనుభూతినిచ్చింది. సినిమాలో గోపీచంద్‌, జగపతిబాబుల అన్నదమ్ముల ఎమోషన్‌ బాగా పండింది. వాళ్లిద్దరూ బయట కూడా అన్నదమ్ముల్లాగే ఉంటారు. ఇది మా 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకంటే పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా. నాకు.. గోపీచంద్‌కు కెరీర్‌ బెస్ట్‌ అవ్వాలి. ప్రేక్షకుల ఆశీర్వాదాలతో మా 'రామబాణం' దూసుకెళ్లిపోవాలని కోరుకుంటున్నా'' అని దర్శకుడు శ్రీవాస్‌ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.